Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరో కబ్జా కేసు..
తమకు ఉన్న 32గుంటల భూమి కబ్జా చేసి, అందులో తమ కట్టడాలను కూల్చివేశారని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు
- Author : Sudheer
Date : 14-06-2024 - 3:08 IST
Published By : Hashtagu Telugu Desk
బిఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) ఫై వరుస భూకబ్జా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అధికారం అడ్డు పెట్టుకొని మల్లారెడ్డి పెద్ద ఎత్తున నగరంలో భూకబ్జాలు చేసినట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కాగా…తాజాగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై మరో కేసు నమోదయింది. తమకు ఉన్న 32గుంటల భూమి కబ్జా చేసి, అందులో తమ కట్టడాలను కూల్చివేశారని ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపైనా ఏడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
మేడ్చల్ జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో శ్రీనివాస్ కు భూమి ఉంది. ఆ భూమి తమదేనంటూ మల్లారెడ్డి కబ్జా చేయడం తో శ్రీనివాస్ కోర్ట్ కు వెళ్ళాడు. కోర్టు కేసులు, ఆదేశాలు ఉన్నప్పటికీ.. 32 గుంటలకుపైగా ఆక్రమించుకున్నారు మల్లారెడ్డి. ఈ భూమి విషయంలో ఇటీవల మల్లారెడ్డి, ఆయన అల్లుడు..ఇతరులు వేసుకున్న ఫెన్సింగ్ తీసేసి హంగామా చేశారు. వివాదంపై అధికారులు సర్వే చేశారు. డాక్యుమెంట్ల ప్రకారం మల్లారెడ్డికి 29 గుంటల భూమి మాత్రమే ఉందని తేల్చారు. అధికారులు జూన్ 13న హైకోర్టుకు నివేదిక అందించారు. సర్వే రిపోర్ట్ను కోర్టు ద్వారా సైబరాబాద్ పోలీసులకు అందజేశారు. దీంతో మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Read Also : Game Changer : పవన్ పొలిటికల్ కారు సీన్‌ని.. ‘గేమ్ ఛేంజర్’లో కాపీ కొట్టేస్తున్న చరణ్..