Konda vs KTR : ఆ నీచమైన వ్యాఖ్యలను తిరిగి చెప్పలేను – కేటీఆర్
Konda vs KTR : దాదాపు 30 నిమిషాల పాటు తన వాంగ్మూలం ఇచ్చారు. సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని జడ్జి అడగగా.. సమంతతో పాటు తనపై ఆమె అతి నీచమైన వ్యాఖ్యలు చేశారని , ఆ వ్యాఖ్యలను తన నోటితో తిరిగి చెప్పడం ఇష్టం లేదని
- Author : Sudheer
Date : 23-10-2024 - 8:28 IST
Published By : Hashtagu Telugu Desk
మంత్రి కొండా సురేఖ (Konda Surekha)పై దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణలో కేటీఆర్ (KTR) నేడు ప్రజాప్రతినిధుల కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు 30 నిమిషాల పాటు తన వాంగ్మూలం ఇచ్చారు. సురేఖ ఏం వ్యాఖ్యలు చేశారని జడ్జి అడగగా.. సమంత (Samantha)తో పాటు తనపై ఆమె అతి నీచమైన వ్యాఖ్యలు చేశారని , ఆ వ్యాఖ్యలను తన నోటితో తిరిగి చెప్పడం ఇష్టం లేదని, ఆ వ్యాఖ్యలకు సంబంధించి రాతపూర్వక ఫిర్యాదును జడ్జి ముందు ఉంచానని పేర్కొన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళా మంత్రి నా పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ అడిక్ట్ అని, రేవ్ పార్టీలు నిర్వహిస్తానని కొండా సురేఖ వ్యాఖ్యానించారు.
సాక్షులు దాసోజు శ్రవణ్, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్.. 18 ఏండ్లుగా నాకు తెలుసు. కొండా సురేఖ వ్యాఖ్యలను టీవీలో చూసి వాళ్లు నాకు ఫోన్ చేసి చెప్పారు. సురేఖ వ్యాఖ్యలతో నా పరువు, ప్రతిష్ట దెబ్బతిన్నాయి. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయాలని కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కేటీఆర్ వాంగ్మూలం విన్న జడ్జ్ ..ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేశారు.
Read Also : PM Modi : యుద్దానికి భారత్ ఎప్పటికీ మద్దతు ఇవ్వదు..దౌత్యానికే : ప్రధాని మోడీ