TS Budget: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళాయే!
తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు మార్చి 7న ప్రారంభం కానున్నాయి.
- By Balu J Published Date - 06:46 PM, Mon - 28 February 22

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు మార్చి 7న ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మార్చి 6న సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. సోమవారం ప్రగతి భవన్‌లో తన మంత్రివర్గ సభ్యులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు, ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులు హాజరవుతున్నారు.
అసెంబ్లీలో హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్‌ను సమర్పించే రోజుపై కూడా త్వరలో నిర్ణయం ఖరారు కానుండగా, సమావేశాల మొదటి రోజు సమావేశమయ్యే బిజినెస్ అడ్వైజరీ కమిటీ బడ్జెట్ కోసం అసెంబ్లీ, కౌన్సిల్ ఎన్ని రోజులు పనిచేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది.
మార్చి 7వ తేదీ (సోమవారం) నుంచి రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం శ్రీ కేసీఆర్ నిర్ణయించారు. కాగా, రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
— Telangana CMO (@TelanganaCMO) February 28, 2022