HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brslp Meeting By Kcr At Telangana Bhavan

KCR : కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు.

  • Author : Latha Suma Date : 23-07-2024 - 3:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR Comments
KCR Comments

KCR : తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు, పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం ముందు ఉంచనుంది బీఆర్ఎస్ పార్టీ. దాదాపు 10 కీలకమైన అంశాలను చర్చించడానికి పట్టుబట్టాలని ఒత్తిడి తీసుకురానున్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నది. ప్రతిపక్షంలో ఉండగా ఆయా వర్గాలను మభ్యపెట్టి, అధికారంలోకి రాగానే అన్నింటినీ అమలు చేస్తామని అలవికాని హమీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేస్తున్న కాంగ్రెస్‌ తీరును ఎండగట్టాలని నిర్ణయించింది.

కాగా, అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ లేవనెత్తే ప్రధాన అంశాలు ఇవే..

1) నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, జాబ్‌ క్యాలండర్‌ విడుదల కోరుతూ ఉద్యమించిన ఉద్యోగార్థులపై ప్రభుత్వ దమనకాండ
2) శాంతిభద్రతల నిర్వహణలో వైఫల్యం
3) చేనేత కార్మికుల ఆత్మహత్యలు.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి
4) ఆరు గ్యారెంటీల అమలు.. శాసనసభలో చట్టబద్ధత
5) రైతు రుణమాఫీ అమలులో ఆంక్షలు-నష్టపోతున్న రైతాంగం
6) పంటల మద్దతు ధరకు అదనంగా బోనస్‌ చెల్లింపుపై ప్రభుత్వ వైఫల్యం-రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదురొంటున్న ఇబ్బందులు
7) గ్రామాలు, పట్టణాలకు నిధుల విడుదలలో అలసత్వం – పారిశుధ్య నిర్వహణ సరిగా లేక కుంటుపడుతున్న ప్రజారోగ్యం
8) ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదురొంటున్న సమస్యలు.

Read Also: Rana Naidu 2 : రానా నాయుడు 2 మొదలైంది..!

 

 

 

 

 

 

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS MLAs
  • kcr
  • telangana bhavan

Related News

Kavitha

KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

జగిత్యాల వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, నిరుద్యోగం వంటి అనేక జ్వలంత సమస్యలు ఉన్నప్పటికీ, అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను

  • Jeevan Reddy Brs

    BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • Harish Rao Kmm

    Khammam : ఖమ్మం జిల్లా మంత్రులపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd