Job Calendar : జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య ఏది..? – బిఆర్ఎస్ సూటి ప్రశ్న
జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూ అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు
- Author : Sudheer
Date : 02-08-2024 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఈరోజు అసెంబ్లీ లో కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ (Congress Job Calendar 2024) ఫై బిఆర్ఎస్ (BRS) ఆగ్రహం వ్యక్తం చేసింది. జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య తెలుపకుండా నిరుద్యోగులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగారు. అసెంబ్లీ చివరి రోజైన శుక్రవారం అసెంబ్లీ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసారు.
* అక్టోబర్లో ట్రాన్స్ కో, డిస్కంల ఇంజినీరింగ్, ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ , మరో గ్రూప్-1 నోటిఫికేషన్
*నవంబర్లో టెట్ నోటిఫికేషన్ 2025
* ఫిబ్రవరి లో గ్రూప్-1 ప్రిలిమ్స్ , డీఎస్సీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్
*2025 జులైలో గ్రూప్-1 మెయిన్స్
*2025 ఏప్రిల్ లో ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆగస్టులో రాతపరీక్ష
*2025 జూన్లో గురుకుల లెక్చరర్ నోటిఫికేషన్
*2025 మేలో గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని భట్టి పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఫై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జాబ్ క్యాలెండర్.. వట్టి బోగస్ అని, ఏదో నాలుగు కాగితాల్లో వారికి ఇష్టమైన వివరాలు రాసుకొచ్చి అసెంబ్లీలో చదివి ఇదే జాబ్ క్యాలెండర్ అని అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇది బోగస్ అని వారికీ తెలుసు అని, ఇది యువతను మోసం చేయడమేనని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూ అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. మార్పు మార్పు అంటూ తెలంగాణ ప్రజలను ఎక్కువ రోజులు ఏమార్చలేరని కేటీఆర్ అన్నారు.
దమ్ముంటే అశోక్‌నగర్‌కు వచ్చి.. నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పమని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. ఈ 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని అక్కడ ఉన్న నిరుద్యోగులతో చెప్పించాలన్నారు. అలా చేస్తే మేమందరం రాజీనామా చేస్తామని సవాలు విసిరారు.
Read Also : Bhatti Vikramarka : జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం