Viraaji Review : ‘విరాజి’ మూవీ రివ్యూ.. వరుణ్ సందేశ్ కొత్త సినిమా ఎలా ఉందంటే..
- By News Desk Published Date - 07:30 PM, Fri - 2 August 24

Viraaji Review : వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా విరాజి. ఈ సినిమాని మహా మూవీస్, M3 మీడియా బ్యానర్స్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో నిర్మించగా కొత్త దర్శకుడు ఆద్యంత్ హర్ష డైరెక్ట్ చేసాడు. ఇందులో అపర్ణ దేవి, కుశాలిని, వైవా రాఘవ, ప్రమోదిని, రఘు, రవితేజ, కోట జయరాం.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. విరాజి సినిమా నేడు ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ : ఒక తొమ్మిది మంది వివిధ కారణాలతో ఊరికి దూరంగా ఉన్న ఒక పాత బిల్డింగ్ కి వస్తారు. ఇందులో ఒక సినిమా నిర్మాత, ఒక పోలీస్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక స్టాండప్ కమెడియన్, ఒక స్వామిజి, ఒక డాక్టర్, ఒక ఈవెంట్ మేనేజర్, ఒక కపుల్.. ఇలా ఒకరికి ఒకరికి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. పదోవాడిగా యాండీ(వరుణ్ సందేశ్) వస్తాడు. ఆ బిల్డింగ్ లో ఒక ఈవెంట్ కోసం వీళ్ళని పిలిచినట్టు కొంతమంది చెప్తారు.
కానీ అక్కడ ఒక కార్డులో వీరందరి పేర్లు రాసి వీళ్లంతా ఒక్కొక్కరు ఒక్కొక్కరి చావుకు కారణం అయ్యారని, ఎవర్ని వదిలేది లేదని రాసి ఉంటుంది. దీంతో అంతా భయపడతారు. అక్కడ్నుంచి వెళ్లిపోదామనుకున్నా వీళ్ళు వచ్చిన వెహికల్స్ కూడా ఉండవు. వీళ్లల్లో ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. అసలు వీళ్లంతా ఎవరు? ఎలా వచ్చారు? వీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? ఇదంతా చేసేది ఎవరు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : ఫస్ట్ హాఫ్ ఇన్ని క్యారెక్టర్స్ ని ఆ బిల్డింగ్ కి తీసుకురావడం, వాళ్ళందరి గురించి చెప్పడం, ఆ బిల్డింగ్ ని హారర్ ఎలిమెంట్ గా చూపించడం సాగుతుంది. ఇంటర్వెల్ సింపుల్ గానే కథ మధ్యలో వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ వీళ్ళ కథలేంటి? అసలు ఎందుకు వీళ్లంతా ఇక్కడ ఉన్నారు అని రివీల్ చేస్తారు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. హారర్ ఎలిమెంట్స్ తో ఒక మాములు కథని థ్రిల్లింగ్ గా కొత్తగా చూపించారు.
నటీనటులు : వరుణ్ సందేశ్ కొత్త గెటప్ లో సరికొత్తగా కనిపించి యాక్టింగ్ తో కూడా అదరగొట్టాడు. ఇక మిగిలిన నటీనటులు ప్రమోదిని, అపర్ణ దేవి, కుశాలిని, వైవా రాఘవ, రఘు, యూట్యూబర్ రవితేజ, కోట జయరాం, ఫణి ఆచార్య, కాకినాడ నాని.. ఇలా అందరూ కూడా తమ పాత్రల్లో మెప్పించారు.
టెక్నికల్ అంశాలు : సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది. మ్యూజిక్ తో ప్రేక్షకులని భయపెడతారు. ఒక మాములు కథని సరికొత్త స్క్రీన్ ప్లేతో బాగా రాసుకున్నాడు దర్శకుడు. డైరెక్టర్ గా ఫస్ట్ సినిమాతోనే ఆద్యంత్ హర్ష సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమా కథకు తగ్గట్టు ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టారు.
ప్లస్ లు :
వరుణ్ సందేశ్ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
స్క్రీన్ ప్లే
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
లొకేషన్
మైనస్ లు :
ఫస్ట్ హాఫ్ సాగదీత
ఫ్లాష్ బ్యాక్ రెగ్యులర్ ఎపిసోడ్
రేటింగ్ : 2.75
Also Read : VD12 First Look : విజయ్ దేవరకొండ ‘VD12’ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్