BRS Master Plan : ప్రచార చివరి రోజున బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేసింది
‘58 ఏళ్ల అధోగతి వర్సెస్ 9 ఏళ్ల ప్రగతి’ పేరిట ఫుల్ పేజీ యాడ్స్
- By Sudheer Published Date - 10:55 AM, Tue - 28 November 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Assembly Election 2023) ఎల్లుండే జరుగనున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూగబోనున్నాయి. నెల రోజులుగా సుడిగాలి పర్యటనలు చేసిన అగ్రనేతలు కాస్త రిలాక్స్ కానున్నారు. ఈ క్రమంలో ప్రచారం చివరి రోజున బిఆర్ఎస్ (BRS) మాస్టర్ ప్లాన్ వేసింది.
ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు వార్త పత్రికల్లో ప్రకటనను ప్రయోగించింది. ఇప్పటికే పలు ప్రకటనలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్, ఈ సారి కాంగ్రెస్ 58 ఏళ్ల పాలనతో 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను పోలుస్తూ ప్రచారం చేసింది. ‘58 ఏళ్ల అధోగతి వర్సెస్ 9 ఏళ్ల ప్రగతి’ పేరిట ఫుల్ పేజీ యాడ్స్ ను సిద్ధం చేసి తెలుగు దినపత్రికలతో పాటు జాతీయ పత్రికల్లో కూడా ఈ యాడ్ (BRS Paper Ad) ప్రచురించింది.
ఫస్ట్ పేజీ లో 11 పర్యాయాల కాంగ్రెస్ పాలన, 2 పర్యాయాల బీఆర్ఎస్ పాలనలను పోలుస్తూ అంకెలతో వివరంగా ప్రకటన చేసింది. అలాగే కేసీఆర్ భరోసా పేరిట – రైతుబంధు రూ. 16వేలకు పెంపు, రూ. 400కే గ్యాస్ సిలిండర్, నెలకు రూ. 5016 ఆసరా పింఛను, సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 3వేలు, అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం, కేసీఆర్ ఆరోగ్య రక్ష కింద రూ. 15లక్షలకు ఆరోగ్య బీమా కవరేజీ ఇలా బిఆర్ఎస్ మేనిఫెస్టో అంశాలను ప్రచురించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రెండో పేజీ లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, సాగవుతున్న భూమి, వరి ఉత్పత్తి, పంట ఉత్పత్తి, తలసరి ఆదాయం, ఐటీ (IT) ఎగుమతులు, ఐటీ ఉద్యోగాలు, విద్యుదుత్పత్తి, రిజర్వాయర్ల సంఖ్య, రోడ్డు పొడవు, వైద్య కళాశాలల (Medical Colleges) సంఖ్య, ప్రభుత్వ గురుకులాల సంఖ్య, హాస్పిటళ్లలో పడకల సంఖ్య, ప్రసూతి మరణాల రేటు, శిశు మరణాల రేటు, పేదరికంలో ఉన్న జనాభా, ఫ్లోరోసిస్ ప్రభావానికి గురైన ఆవాసాల సంఖ్య అంశాలను కాంగ్రెస్ పాలనతో పోలుస్తూ గణాంకాలతో సహా ప్రచురించారు. ఇలా బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేసి జనాల్లోకి వెళ్లింది.
Read Also : Woman – 40 Years Jail : రాక్షస తల్లికి 40 ఏళ్ల జైలు.. ఇద్దరు కూతుళ్లపై ఇద్దరు లవర్స్‌తో రేప్ !