BRS MP Venkatesh : కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ ఎంపీ..
- Author : Sudheer
Date : 06-02-2024 - 11:03 IST
Published By : Hashtagu Telugu Desk
అసెంబ్లీ ఎన్నికల ముందే కాదు ఎన్నికల తర్వాత కూడా బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. వరుస పెట్టి నేతలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది నేతలు చేరగా..తాజాగా పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ (BRS MP Venkatesh Joins Congress Party) సైతం బిఆర్ఎస్ కు రాజీనామా చేసి..కాంగ్రెస్ లో చేరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు ఎంపీ వెంకటేష్. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. వెంకటేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఎంపీతోపాటు మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేత.. అతర్వాత మారిన రాజకీయ పరిణామాలతో పెద్దపల్లి ఎంపీగా పోటీ విజయం సాధించారు. ప్రస్తుత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఎంపీగా వెంకటేష్ నేత కొనసాగుతున్నారు.
Read Also : PAN-Aadhaar Linking: ఆధార్- పాన్ లింక్ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ..!