MLC Kavitha: లిక్కర్ ఇష్యూలో రాజగోపాల్ రెడ్డికి కవిత కౌంటర్!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
- By Balu J Published Date - 01:54 PM, Wed - 21 December 22

తనను లిక్కర్ క్వీన్‌గా అభివర్ణించిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy)కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kaitha) కౌంటర్ ఇచ్చారు. 28 సార్లు చెప్పినా, 28 వేల సార్లు చెప్పినా అబద్ధం నిజం కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అయితే రాజగోపాల్ అన్నగా ఆమె అభివర్ణించారు. ED కొత్త ఛార్జిషీట్‌లో కవిత పేరును ప్రస్తావించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను రాజగోపాల్ రీట్వీట్ చేశారు. ఛార్జ్ షీట్‌లో లిక్కర్ క్వీన్స్ పేరు 28 సార్లు ప్రస్తావించబడిందని ఆయన ట్వీట్ (Tweet) చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు బూటకమని, తన చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుందని కవిత అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జ్ షీట్‌లో చేరింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ మహేంద్రు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) పేరును ప్రస్తావించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. కవిత సమీర్ మహేంద్రుని ఫేస్‌టైమ్‌లో రెండుసార్లు, హైదరాబాద్‌లో ఒకసారి కలిసినట్లు తెలుస్తోంది.
ఇండో స్పిరిట్స్‌ను రామచంద్ర పిళ్లై ముందుండి నడిపించారని సమీర్ మహేంద్రూ వెల్లడించినట్లు ఈడీ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది. ఇండో స్పిరిట్స్‌లో కవిత, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి నిజమైన భాగస్వాములని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమ చార్జిషీట్‌లో పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత ఉపయోగించిన 10 సెల్‌ఫోన్‌లను ఆధారాలు లేకుండా ధ్వంసం చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమీర్ మహేంద్రు చార్జిషీట్‌లో పేర్కొంది.
రాజగోపాల్ అన్న ..
తొందరపడకు , మాట జారకు !!
" 28 సార్లు " నా పేరు చెప్పించినా
" 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా
అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail https://t.co/476lW6fOTC— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022
Also Read: Trouble in BRS: ఎమ్మెల్యే వర్సెస్ మేయర్.. బీఆర్ఎస్ లో అంతర్గత పోరు!