HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Mlas Defection Case

BRS MLAs’ Defection Case : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో కీలక మలుపు

BRS MLAs' Defection Case : ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ కార్యదర్శిని హెచ్చరించింది

  • Author : Sudheer Date : 03-02-2025 - 3:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Mlas' Defection Case
Brs Mlas' Defection Case

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, వారి అనర్హత(BRS MLAs’ Defection Case)పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ కార్యదర్శిని హెచ్చరించింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఎజీ మసీహ్‌ల ధర్మాసనం ఈ కేసును ఫిబ్రవరి 10న మళ్లీ విచారణకు తీసుకుంటామని పేర్కొంది.

Jogi Ramesh : జోగికి భయం పట్టుకుందా..?

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి పార్టీ మార్పు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం రేపింది. బీఆర్‌ఎస్‌ నాయకులు వీరి అనర్హతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శాసనసభ స్పీకర్‌కు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ అంశం కోర్టుల వరకు వెళ్లింది. తెలంగాణ హైకోర్టు తొలుత స్పీకర్‌ను అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో విచారణ నిర్వహించాలని ఆదేశించింది. కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను రద్దు చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసును విచారణలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు గతంలో సుబాష్ దేశాయ్ కేసులో స్పీకర్ అనర్హత పిటిషన్లను తగిన సమయంలో నిర్ణయించాలనే అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ శాసనసభ కార్యదర్శిని మీ అభిప్రాయంలో తగిన సమయం ఎంత? అని ప్రశ్నించింది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు ఈ ఫిరాయింపులను తీవ్రంగా విమర్శించారు. ఫిరాయింపులు నియంత్రించేందుకు త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలస్యం మరిన్ని ఫిరాయింపులకు దారి తీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ నుండి వివరణ కోరింది. స్పీకర్ ఈ అంశంపై స్పందించిన తర్వాత తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరుగనుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా చర్చిస్తున్నారు. ఓటర్ల నమ్మకాన్ని మోసం చేసి పార్టీ మారే ఎమ్మెల్యేలకు గుణపాఠం నేర్పాలని కోరుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLAs' Defection Case
  • congress party
  • MLA Padi Kaushik Reddy
  • Supreme Court

Related News

Green signal for Musi rejuvenation; government approves ₹7,000 crore project.

Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరాల సరసన నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ మెగా ప్రాజెక్టు పరిధిలోని ప్రాధాన్యతా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌కు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ త

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Good news for unemployed youth in Telangana: Another notification released by TGPSC.

    తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

  • Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd