Kali Mandir in Gandipet : బాధితులకు అండగా నిలిచిన హరీష్ రావు
Kali Mandir in Gandipet : తమ ఇళ్లు, దుకాణాలు కొన్నేళ్లుగా ఉన్నాయని, అకస్మాత్తుగా తొలగిస్తే తమ జీవితాలు అంధకారంలో పడిపోతాయని బాధితులు (Victims ) ఆవేదన వ్యక్తం చేశారు
- By Sudheer Published Date - 07:44 PM, Mon - 10 February 25

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తన మాట నిలబెట్టుకున్నారు. గండిపేటలో కాళీమందిర్ (Kali Mandir in Gandipet) సమీపంలో జరుగుతున్న ఇళ్ల, దుకాణాల తొలగింపును ఆపేందుకు ఆయన స్వయంగా జెసిబీ ముందు నిలబడి నిరసన తెలిపారు. తమ ఇళ్లు, దుకాణాలు కొన్నేళ్లుగా ఉన్నాయని, అకస్మాత్తుగా తొలగిస్తే తమ జీవితాలు అంధకారంలో పడిపోతాయని బాధితులు (Victims ) ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్ రావు దగ్గరకు కన్నీళ్లతో వెళ్లి తమ పరిస్థితి వివరించడంతో ఆయన వెంటనే స్పందించారు.
ఇళ్లను సడెన్ గా కూల్చేస్తే ప్రజలు ఎలా బతకాలని అధికారులను హరీష్ రావు నిలదీశారు. ఇక్కడున్న కుటుంబాలు, వ్యాపారులు దశాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్నారని, ఒక్కసారిగా వారిని నిరాశ్రయులను చేయడం అన్యాయమని అన్నారు. అధికారులతో చర్చించకుండానే ఇళ్లను కూల్చివేయడం ఏ విధంగా సమంజసం అని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా సంఘటనాస్థలంలోనే హరీశ్ రావు.. బండ్లగూడ జగీర్ మున్సిపల్ కమిషనర్‌కు నేరుగా ఫోన్ చేసి వెంటనే ఇక్కడికి రావాలని ఆదేశించారు. ప్రజల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని న్యాయం జరిగేలా చూడాలని కమిషనర్‌ను కోరారు. బాధితుల గోడు ఆలకించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
హరీశ్ రావు జోక్యంతో మున్సిపల్ కమిషనర్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులకు తగిన సూచనలు ఇచ్చిన వెంటనే, మున్సిపల్ సిబ్బంది కూల్చివేతలు ఆపేశారు. కూల్చివేతలు ఆపివేయడం తో హరీష్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక హరీష్ రావు చేసిన సహాయానికి బాధితులు హర్షం వ్యక్తం చేసారు.
BRS MLA Harish Rao stayed true to his word – he literally stood in front of a JCB to stop demolition.
Victims who approached his car in tears, requesting that their homes and shops were being demolished near Kali Mandir in Gandipet.
Harish Rao questioned officials how people… pic.twitter.com/LNuEGFY5yI
— Naveena (@TheNaveena) February 10, 2025