HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Meeting Scheduled For Tomorrow Been Cancelled This Is The Real Truth

BRS Silver Jubilee Celebrations : రేపు జరగబోయే బిఆర్ఎస్ సభ రద్దైందా..? అసలు నిజం ఇదే !

BRS Silver Jubilee Celebrations : పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సభ రద్దు అయినట్టు కొందరు ఫేక్ ప్రచారం (Fake Campaign) చేస్తుండగా, ప్రజల నుండి వస్తున్న అపూర్వమైన ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాయని బీఆర్ఎస్ మండిపడింది

  • By Sudheer Published Date - 08:55 PM, Sat - 26 April 25
  • daily-hunt
Brs Silver Jubilee Meeting
Brs Silver Jubilee Meeting

వరంగల్‌లో రేపు( ఏప్రిల్ 27న) జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ (BRS Silver Jubilee) రద్దైందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని (Social Media) బీఆర్ఎస్ పార్టీ (BRS) ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, సభ యథాతథంగా జరగబోతుందని స్పష్టం చేసింది. పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సభ రద్దు అయినట్టు కొందరు ఫేక్ ప్రచారం (Fake Campaign) చేస్తుండగా, ప్రజల నుండి వస్తున్న అపూర్వమైన ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నాయని బీఆర్ఎస్ మండిపడింది. ఈ సభతో కాంగ్రెస్, బీజేపీల భవిష్యత్తు భూస్థాపితం అవడం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం

వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలో జరగనున్న ఈ రజతోత్సవ సభను బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేయగా, ప్రధాన వేదికను 154 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల విస్తీర్ణం కేటాయించడం విశేషం. సభను మరింత భవ్యంగా మార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకొని, 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 అంబులెన్సులు, 12 వైద్య శిబిరాలు, 1,200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా 250 జనరేటర్లు ఏర్పాటు చేయడం గమనార్హం.

గులాబీ జెండాలతో వరంగల్ మార్మోగనుంది

ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. సభలో గులాబీ జెండాలు రెపరెపలాడనున్నాయి. సభ విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను తరలించేందుకు 3,000 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, వేలాది డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లు, వ్యాన్లు కూడా ఉపయోగించబోతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపి, గులాబీ జెండాను మరింత ఎగురవేసేలా చేయబోతోంది.

Sudan War Effect: యుద్ధం ఎఫెక్ట్.. బొగ్గు, ఆకులు తింటున్న జనం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Silver Jubilee celebrations
  • BRS Silver Jubilee Meeting Cancelled
  • Fake campaign
  • social media

Related News

Nag Delhi Hc

Nagarjuna Delhi High court : ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన నాగార్జున

Nagarjuna Delhi Hicourt : టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) సోషల్ మీడియాలో తన పేరు, ఫోటో, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా వాడకూడదని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

    Latest News

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • Sharmila Meets CBN : సీఎం చంద్రబాబును కలవబోతున్న షర్మిల..ఎందుకంటే !!

    Trending News

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd