Bandaru Vijayalakshmi : గవర్నర్ దత్తాత్రేయ కూతురు మద్దతు కోరిన బిఆర్ఎస్ నేతలు
మాజీ కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు కొణతమంది బిఆర్ఎస్ నేతలు దత్తాత్రేయ ఇళ్లున్న గల్లీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు
- By Sudheer Published Date - 12:13 PM, Tue - 21 November 23

ఎన్నికల ప్రచార (Telangana Election Campaign) సమయం ముంగిపు దశకు చేరుకోవడం తో అధికార పార్టీ (BRS) తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఇలా అన్ని కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేపనిలో నిమగ్నమయ్యారు. ప్రతిఇంటిని వదిలేయపెట్టకుండా ప్రచారం చేస్తూ మద్దతు కోరుకుంటున్నారు. ఇక బిఆర్ఎస్ విషయానికి వస్తే ముందు నుండి కూడా నేతలు దూకుడు కనపరుస్తూ వస్తున్నారు. ఓ పక్క గులాబీ బాస్ , సీఎం కేసీఆర్ (CM KCR) ప్రజా ఆశీర్వద సభల పేరుతో నియోజకవర్గాలను కవర్ చేస్తూ వస్తుంటే మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ కు , ఎంపీటీసీ , జడ్పీటీసీ ఇలా ప్రతి ఒక్కరు ఇల్లు నుండి గల్లీ వరకు ఏది వదలకుండా..అలాగే ఇతర పార్టీల నేతలను సైతం మద్దతు కోరుతూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. తాజాగా మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya Daughter) కూతుర్ని (Vijayalakshmi ) కూడా మద్దతు కోరి వార్తల్లో నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసం ముషీరాబాద్ పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాజీ కార్పోరేటర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు కొణతమంది బిఆర్ఎస్ నేతలు దత్తాత్రేయ ఇళ్లున్న గల్లీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇలా ప్రతిఇంటికి వెళుతూ దత్తాత్రేయ ఇంటికి కూడా వెళ్లి మద్దతు కోరారు. ఈ సమయంలో ఇంట్లో ఆయన కూతురు విజయలక్ష్మి కనిపించడంతో ఆమెకు బిఆర్ఎస్ పార్టీ కరపత్రం అందిస్తూ ఫోటోలు దిగి , బిఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కు ఓటేయాలని విజయలక్ష్మిని కోరారు. వాస్తవానికి ముషీరాబాద్ బిజెపి టికెట్ ను విజయలక్ష్మి కోరారు… కానీ అదిష్టానం ఆమెకు కాకుండా పూస రాజుకు టికెట్ ఇచ్చారు. దీంతో విజయలక్ష్మి కాస్త అసంతృప్తికి గురయ్యారు. ప్రస్తుతం ఆమె తటస్తంగా ఉండడం తో ఆమె మద్దతును బిఆర్ఎస్ నేతలు కోరారు.
Read Also : EC: మేడ్చల్ లో 2 లక్షలు, 74 చీరలు స్వాధీనం, మల్లారెడ్డిపై అనుమానం