EC: మేడ్చల్ లో 2 లక్షలు, 74 చీరలు స్వాధీనం, మల్లారెడ్డిపై అనుమానం
నవంబర్ 30న ఎన్నికలు ఉండటంతో అధికారులు తెలంగాణ వ్యాప్తంగా చెకింగ్ చేస్తున్నారు.
- By Balu J Published Date - 11:45 AM, Tue - 21 November 23

EC: నవంబర్ 30న ఎన్నికలు ఉండటంతో అధికారులు తెలంగాణ వ్యాప్తంగా చెకింగ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన 74 చీరలు, రూ.2 లక్షల లెక్కల్లో చూపని నగదును ఎన్నికల కమిషన్ (ఈసీ) ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ (ఎఫ్‌ఎస్‌టీ) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పీర్జాదిగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్‌కు సంబంధించిన కార్యాలయంలో స్థానిక కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు దాడులు చేశారు. మంత్రి మల్లారెడ్డి కరపత్రాలను కూడా ఇసి బృందం గుర్తించింది. వీటిని స్వాధీనం చేసుకున్న ఆస్తులతో మంత్రికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లారెడ్డి, తాజా ఘటనతో మరోసారి చిక్కుల్లో పడినట్టైంది.
After complaint by #Congress, Flying Squad Team (FST) of the #ElectionCommission and police raided at an office in Peerzadiguda in #Medchal constituency and seized 74 sarees and ₹2 lakh unaccounted cash, with #BRS minister #MallaReddy pamphlet.#TelanganaAssemblyElections2023 pic.twitter.com/ZD3KtIAHBs
— Surya Reddy (@jsuryareddy) November 20, 2023
Also Read: Sreeleela: శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ ‘రొటీన్’ పాత్రలు, యంగ్ బ్యూటీ ఫ్యాన్స్ డిజాప్పాయింట్