BRS Leaders Join Congress : కూకట్ పల్లి లో కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు
ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లో దాదాపు1000 మంది పైగా యువత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
- By Sudheer Published Date - 09:27 PM, Tue - 21 November 23

ఎన్నికల పోలింగ్ (TS Polls) సమయం దగ్గరపడుతుండడం తో వలసల పర్వం మరింత జోరు అందుకుంటుంది. మొన్నటి వరకు కీలక నేతల పర్వం కొనసాగగా..ఇప్పుడు కార్యకర్తల వంతు నడుస్తుంది. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతుండగా..ఈరోజు కూకట్ పల్లి (kukatpally) లో బిఆర్ఎస్ (BRS) – బిజెపి (BJP) పార్టీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి చేరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లో దాదాపు1000 మంది పైగా యువత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్- బీజేపీ పార్టీల మాయ మాటలు నమ్మేస్థితిలో యువత లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎక్కడ చూసినా మంచి స్పందన కనిపిస్తుందని బండి రమేష్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా తల్లికి ఎన్నికల్లో ఓటు వేసి రుణం తీర్చుకోవాలని నియోజకవర్గ ప్రజలకి ఆయన విజ్ఞప్తి చేశారు.
Read Also : National Herald Case : రాహుల్, సోనియా గాంధీకి ఈడీ షాక్..