Mandava Venkateswara Rao : చక్రం తిప్పిన తుమ్మల, రేవంత్.. కాంగ్రెస్ లోకి మరో కీలక నేత !
Mandava Venkateswara Rao : సెటిలర్స్ జనాభా ఎక్కువగా ఉండే నిజామాబాద్ జిల్లాలో మంచి పలుకుబడి కలిగిన నేత మండవ వెంకటేశ్వర రావు.
- By Pasha Published Date - 12:11 PM, Sun - 15 October 23

Mandava Venkateswara Rao : సెటిలర్స్ జనాభా ఎక్కువగా ఉండే నిజామాబాద్ జిల్లాలో మంచి పలుకుబడి కలిగిన నేత మండవ వెంకటేశ్వర రావు. 2019 లోక్‌సభ ఎన్నికల వేళ ఎంపీ ఎన్నికల్లో తన కుమార్తె కవిత గెలుపు కోసం.. మండవ ఇంటికి స్వయంగా సీఎం కేసీఆర్ వెళ్లారు. దీన్నిబట్టి నిజామాబాద్ పై మండవకు ఉన్న పట్టు ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ లోకి మండవ చేరారు. అనంతరం మండవకు ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా.. ఎలాంటి పదవీ దక్కలేదు. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల ఫలితం సంగతి అలా ఉంచితే.. తనను వాడుకొని వదిలేశారనే ఫీలింగ్ లోకి మండవ వెంకటేశ్వర రావు వెళ్లిపోయారు. ఈక్రమంలోనే ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ కు జై కొట్టేందుకు రెడీ అవుతున్నారు. నేడో, రేపో ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీ కండువాను కప్పుకోనున్నారు. ఆయనకు నిజామాబాద్ రూరల్ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
నిజామాబాద్ రూరల్..
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంపై మండవకు మంచి పట్టుంది. సెటిలర్స్ ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రికార్డు మండవకు ఉంది. వెంకటేశ్వరరావు 1985, 89, 94, 99 అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా వరుస విజయాలు అందుకున్నారు. 2004లో ఒక్కసారి ఓడినా, తిరిగి 2009 నిజామాబాద్ రూరల్ నుంచి పోటీచేసి విన్నయ్యారు.ఉమ్మడి ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, ఎక్సైజ్, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
We’re now on WhatsApp. Click to Join.
5 సార్లు ఎమ్మెల్యేగా..
మండవ వెంకటేశ్వర రావు పొలిటికల్ కెరీర్ తెలుగుదేశం పార్టీలో మొదలైంది. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ తో ఆయన పనిచేసేవారు. నాటి డిచ్ పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మండవ. మంత్రి పదవులు కూడా చేపట్టారు. చంద్రబాబుకు నమ్మకమైన వ్యక్తిగా అప్పట్లో పేరు తెచ్చుకున్నారు. బీఆర్ఎస్లో గుర్తింపులేక నాలుగున్నరేండ్ల నుంచి సైలెంట్‌గా ఉన్న ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన తన దగ్గరి బంధువు తుమ్మల నాగేశ్వరరావు ద్వారా కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి మండవకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి సైతం నాలుగు రోజుల కింద హైదరాబాద్‌లో మండవను కలిసి కాంగ్రెస్‌లోకి రావాలని (Mandava Venkateswara Rao) ఆహ్వానించినట్లు సమాచారం.