BRS Manifesto 2023 : కేసీఆర్ హామీల వల్ల ప్రభుత్వం ఫై ఎంత భారం పడుతుందో తెలుసా..?
వరాల్ గా బిఆర్ఎస్ హామీల వల్ల ప్రభుత్వం ఫై రూ. 52,461కోట్లు భారం పడుతుందని అంటున్నారు. మరి ఇంత భారం మళ్లీ ప్రజలపైనే కదా అని అంటున్నారు.
- By Sudheer Published Date - 11:43 AM, Wed - 18 October 23

ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు..అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) ఎక్కడ లేని హామీలు ఇస్తుంటారు. ఆ హామీలు చూసి ఓటర్లు సదరు పార్టీలకు ఓట్లు వేసి గెలిపిస్తారు. ఆలా అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేస్తుంటారు. ఆ తర్వాత హామీలు నెరవేర్చలేదని అడిగేవారే ఉండరు. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి ఏవో కొన్ని హామీలు నెరవేర్చి..మళ్లీ కొత్త హామీలు (Guarantees) ప్రకటిస్తుంటారు. ఇలా చాల పార్టీలు ఇలాగే చేస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ లో వచ్చే నెలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు హామీల వర్షం కురిపిస్తూ వస్తున్నాయి.
బిఆర్ఎస్ పార్టీ హామీలు (BRS Guarantees) :
ఇప్పటివరకు రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్..ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో తాజాగా మేనిఫెస్టో ను రిలీజ్ చేసింది. గతంలో కిష రూపాలు హామీలు ఇచ్చారు..వాటిలో కొన్ని నెరవేర్చి..ఇవ్వని హామీలను కూడా రాష్ట్రంలో అమలు చేసి ఆకట్టుకున్నారు. అయితే ఈసారి పలు హామీలు ప్రకటించగా..అవి కాంగ్రెస్ హామీల మాదిరిగానే ఉన్నాయని..కొత్తగా ఏమిలేవని అంటున్నారు. మరికొంతమంది కేసీఆర్ ప్రకటించిన హామీలు నెరవేరుస్తాడా..? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బిఆర్ఎస్ తాజా మేనిఫెస్టో (BRS Manifesto 2023) :
గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలనే అమలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. హామీలను అమలు చేయాలంటే ప్రభుత్వ రాబడులు సరిపోక.. అప్పులు చేసి పథకాలను అమలు చేయాల్సి వస్తోంది. విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాల్సి వస్తోంది. మరి ఇప్పుడు ప్రకటించిన పేదలకు రూ.5 లక్షల వరకు బీమా, ఆసరా పెన్షన్లు రూ.5,016కు పెంపు, రూ.400కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు సాయం రూ.16 వేలకు పెంపు, అర్హులైన మహిళలకు రూ.3 వేల చొప్పున భృతి వంటి హామీ పధకాలు ఇంతవరకు అమలు చేస్తారనేది అనుమానిస్తున్నారు.
బిఆర్ఎస్ హామీల భారం (BRS Guarantees Burden)
కేసీఆర్ తాజాగా ప్రకటించిన పథకాల్లో రూ.5 లక్షలబీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.3 వేల చొప్పున భృతి వంటివి కొత్తవి కాగా, మిగతావి పాతవే. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఈ పథకాలన్నింటినీ అమలు చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.52,461 కోట్ల భారం పడుతుంది. ఈ హామీల భారం కలిపి రూ.3.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ను పెట్టాల్సి వస్తుంది. కానీ, రాష్ట్ర రాబడులు మాత్రం రూ.2 లక్షల కోట్లకు మించడం లేదు. ఇలాంటి సమయంలో అవన్నీ ఎలా అమలు చేస్తారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ (GS) వినియోగదారులు 1.27 కోట్ల మంది ఉన్నారు. వీరికి నెలకు 52 లక్షల సిలిండర్లు వినియోగమవుతున్నాయి. ఒక్కో సిలిండర్ ధర రూ.955. కాగా, ప్రభుత్వం రూ.400కే సిలిండర్ ఇస్తామంటున్నందున.. ఒక్కో సిలిండర్‌కు రూ.555 చొప్పున సబ్సిడీని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కన 52 లక్షల సిలిండర్లకు నెలకు రూ.288.60 కోట్లను భరించాలి. ఏడాదికి దీని భారం ఏడాదికి రూ.3,463.20 కోట్లు అవుతుంది. మరి అంత భారం ఎలా మోస్తుంది..? అంటే అప్పు చేయాల్సిందే..లేదా ప్రభుత్వ భూములు అమ్మాల్సిందేగా..
ఇక రైతుబంధు విషయానికి వస్తే…ఇప్పటీకే చాలామంది రైతుబంధు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. 5 ఎకరాల్లో ఉన్న వారికీ రైతు బంధు ఇస్తే బాగుంటుందని..అంతే కానీ వందల ఎకరాలు ఉన్న వారికీ కూడా రైతు బంధు ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఫై పెను భారం పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో మరోసారి రైతు బంధు పెంచుతామంటూ కేసీఆర్ ఇచ్చిన తాజా హామీ ఫై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం కోటిన్నర ఎకరాలకు రైతుబంధు పథకం అమలవుతోంది. ప్రతి ఏడాదికి ఎకరాకు ఇస్తున్న రూ.10 వేలను రూ.16 వేలకు పెంచుతామంటున్నారు. రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తే.. ఏడాదికి రూ.15 కోట్లు వ్యయమవుతున్నాయి. అదే రూ.16 వేల చొప్పున అందజేస్తే రూ.24 వేల కోట్లు కావాలి. అంటే రూ.9 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. అంటే ఆ భారం అంత మళ్లీ ప్రజలపైనే వేస్తారు కదా అని అంటున్నారు.
ఆసరా పించన్ రూ.5016 చేయడం వల్ల రూ.1,284 కోట్లు భారం పడుతుందని , ఆరోగ్య శ్రీ రూ.15 లక్షలు పెంచితే ప్రభుత్వం ఫై అదనంగా రూ.650-700 కోట్ల భారం , పేద మహిళలకు 3వేల భృతి వల్ల ఏడాదికి రూ.22 వేల కోట్ల భారం , పేదలకు రూ.5 లక్షల భీమా వల్ల ఏడాదికి రూ.2,100 కోట్ల భారం , ఓవరాల్ గా బిఆర్ఎస్ హామీల వల్ల ప్రభుత్వం ఫై రూ. 52,461కోట్లు భారం పడుతుందని అంటున్నారు. మరి ఇంత భారం మళ్లీ ప్రజలపైనే కదా అని అంటున్నారు. అందుకే ప్రజలకు ఉచిత పధకాలు తగ్గించి ఉద్యోగాలు , పనులు కలిపిస్తే వారే చూసుకుంటారని అంటున్నారు.
Read Also : TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, బతుకమ్మ, దసరా సందర్భంగా TSRTC లక్కీ డ్రా షురూ!