BRS : బీఆర్ఎస్‌లో మొదలైన అసంతృప్తి గళం.. టికెట్ రాని నేతల నుంచి అసమ్మతి సెగ..
తెలంగాణలో ఎలక్షన్స్ హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ (BRS) నేడు ఒకేసారి రాబోయే ఎన్నికల్లో నిలబడే తమ అభ్యర్థుల్ని ప్రకటించి ప్రతిపక్షాలకు ఝలక్ ఇచ్చింది.
- Author : News Desk
Date : 21-08-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana)లో ఎలక్షన్స్ (Elections) హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ (BRS) నేడు ఒకేసారి రాబోయే ఎన్నికల్లో నిలబడే తమ అభ్యర్థుల్ని ప్రకటించి ప్రతిపక్షాలకు ఝలక్ ఇచ్చింది. అయితే ఒక 7 స్థానాల్లో మాత్రం ఇంకా అభర్ధులని ఫైనల్ చేయలేదు. కొన్ని స్థానాల్లో అభర్ధులని మార్చింది. చాలా వరకు సిట్టింగ్ లకే స్థానం కల్పించారు.
అయితే అభర్ధులని మార్చిన చోట, కొన్ని చోట్ల కొత్త అభర్ధులు టికెట్ ఆశించి భంగపడ్డ చోట ఎమ్మెల్యే టికెట్ల విషయంలో అసంతృప్తి నెలకొంది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానానికి అప్పుడే అసమ్మతి సెగ మొదలైంది.
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు బీఆర్ఎస్ లో నిరసనలు చేస్తున్నారు కార్యకర్తలు. పఠాన్ చెరు లో ఎమ్మల్యే టికెట్టు ఆశించి నీలం మధు ముదిరాజ్ భంగపడ్డాడు. దీంతో బిసిలకు అన్యాయం జరిగిందని, ముఖ్యంగా ముదిరాజ్ లకు ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బిసిల కొరకు మరో ఉద్యమం చేస్తామని అన్నాడు.
ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఎమ్మెల్యే రేఖానాయక్ బదులు జాన్సన్ రాథోడ్ నాయక్ కి టికెట్ ఇచ్చారు. దీంతో అనుచరులతో రేఖ నాయక్ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో రేఖ నాయక్ మాట్లాడుతూ.. ఇంకా కొన్ని రోజులు నేను ఎమ్మెల్యేనే. చివరి క్షణం వరకు గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు తీరుస్తాను. 50 రోజుల తర్వాత ప్రజల అభీష్టం మేరకే నా నిర్ణయం ఉంటుంది. పార్టీ మారాలని ఇప్పటికైతే ఆలోచించలేదు. నా జీవితం ఖానాపూర్ ప్రజలకు అంకితం. చిట్టచివరి వరకు ఖానాపూర్ లోనే ఉంటాను అని తెలిప్పింది.
ఇక పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి ఎమ్మెల్యే టికెట్ ని నల్ల మనోహర్ రెడ్డి ఆశించి భంగపడ్డాడు. మంత్రి కేటీఆర్ కు తొమ్మిదేళ్లుగా ప్రధాన అనుచరుడుగా ఉన్నా తనని పట్టించుకోలేదని ఆవేదన చెందాడు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి నల్ల మనోహర్ రెడ్డి రాజీనామా చేశాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా అయినా బరిలో ఉంటా అని ప్రకటించాడు. ఇలాగే మరిన్ని చోట్ల కూడా అసంతృప్తి గళం వినిపిస్తుంది. మరి వీరిని కేటీఆర్,కేసీఆర్ పిలిచి మాట్లాడతారేమో చూడాలి.
Also Read : BRS Candidates List : కేసీఆర్ ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ – రేవంత్ రెడ్డి