Coffee on Wheels: కమ్మని ‘‘కాఫీ’’ మన ముంగింట్లోకే!
కమ్మని కాఫీ తాగనివారు ఎవరైనా ఉంటారా.. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది కాఫీ తాగడానికి ఇష్టం చూపుతుంటారు. ఎర్నీ మార్నింగ్, చల్లని సాయంత్రం నురగలే కక్కే కాఫీ గొంతులోకి దిగితే ఆ టెస్టే వేరు. కానీ ఆ రుచులు
- By Balu J Published Date - 05:22 PM, Thu - 10 February 22

కమ్మని కాఫీ తాగనివారు ఎవరైనా ఉంటారా.. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది కాఫీ తాగడానికి ఇష్టం చూపుతుంటారు. ఎర్నీ మార్నింగ్, చల్లని సాయంత్రం నురగలే కక్కే కాఫీ గొంతులోకి దిగితే ఆ టెస్టే వేరు. కానీ ఆ రుచులు అందించేవారు ఎవరు? అంటే ఇదిగో ‘మేమున్నాం’ అంటూ మన ముందుకొస్తున్నాయి కాఫీ బండ్లు. ఇవి అక్కడిక్కడే కాఫీని తయారుచేసి అందిస్తాయి.
హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ బాస్క్ అసోసియేట్స్ దేశంలోనే గో మోడల్‌లో మొట్టమొదటిసారిగా తాజాగా తయారుచేసిన ‘కాఫీ ది బ్రూ ట్రైబ్ ఎట్ టి-హబ్’లో బుధవారం మార్కెట్లోకి వస్తున్నట్టు ప్రకటించింది. WEHub సీఈవో దీప్తి రావుల సమక్షంలో ఐటీ మరియు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బ్రూ ట్రైబ్ కాఫీ కస్టమర్లకు అదిరిపొయే అనుభూతిని అందిస్తుంది. తక్కువ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ కప్పులలో చాలా తక్కువ ధరకే కాఫీ రుచులను ఆస్వాదించవచ్చు. యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న ఈ మెషిన్లు అక్కడిక్కడే కాఫీని తయారు చేసి అందిస్తుంది.
గచ్చిబౌలిలో కంపెనీ చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నడుస్తుందని, ప్రతిరోజు వందమందికిపైగా కాఫీని తాగుతున్నారని స్టార్టప్ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం గచ్చిబౌలికే పరిమితమైన ఈ కాఫీ మెషిన్లు త్వరలో సిటీ మొత్తం తిరగనున్నాయి. కనీసం వందకు ప్రాంతాల్లో కాఫీ మెషిన్లు తిరగనున్నాయి. మొదట మాదాపూర్, ఖాజాగూడ, కెబిఆర్ పార్క్, దుర్గం చెరువు, గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్స్ వంటి హబ్‌ల వద్ద, కాలేజ్‌లు, ఆఫీసులకు వెళ్లే కాఫీ ప్రియుల కోసం బండ్లను ఏర్పాటు చేస్తారు. అనేక రకరకాల కాఫీ రుచులను అందించడంతో పాటు, సమ్మర్ సీజన్ సందర్భంగా కోల్డ్ కాఫీలను అందిస్తాయి.