Bandi: నేటికీ ఒక్క డీఎస్సీ లేదు.. లెక్చరర్ పోస్టూ లేదు.. కేసీఆర్ పై బండి ఫైర్!
నిరుద్యోగ భృతి కోసం... ఉద్యోగ ఖాళీల భర్తీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ 'కోట్ల సంతకాల సేకరణ' కార్యక్రమాన్ని ప్రారంభించారు.
- By Balu J Published Date - 02:18 PM, Sun - 30 January 22

నిరుద్యోగ భృతి కోసం… ఉద్యోగ ఖాళీల భర్తీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ‘కోట్ల సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకే అని ప్రకటించిన సీఎం కేసీఆర్ హామీ నెరవేరకపోవడంతో రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యమనేతగా కేసీఆర్ ఇచ్చిన హామీలు సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారని, కేసీఆర్ 2014 అసెంబ్లీలో లక్షా 7వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడున్నరేళ్ల నుంచి ఒక్క గ్రూప్-1 లేదనీ, మూడేళ్ల నుంచి జాబ్ నోటిఫికేషన్ లేదనీ, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఇప్పటి వరకు పరామర్శించలేదని గుర్తుచేశారు. ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క లెక్చరర్ పోస్టు లేదు.. యూనివర్సిటీ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడం లేదని బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
నిన్నగాక మొన్న ముత్యాల సాగర్ అనే నిరుద్యోగి సీఎంకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ పోస్ట్ చేశాడని, సింవన్నీ దూతకోర్ మాటలే.. ఎన్నికొలొచ్చినప్పుడల్లా ఉద్యోగ నోటిఫికేషన్లు బూచితో మభ్యపెడుతున్నారని, అందుకే ఉద్యోగాల కోసం BJYM అనేక పోరాటాలు చేస్తోందని బండి స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం మాటలపై తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయిందని, సీఎం ఇంకా సీఎం పదవిలో ఎందుకు కొనసాగుతున్నారో ఈయనకు అర్థం కావడం లేదనీ ఎద్దేవా చేశారు. లక్షల మందికి ఉపాధి కల్పించామని పచ్చ అబద్దాలు చెబుతున్నా… కేసీఆర్ ప్రభుత్వం దమ్ముంటే జాబితా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు బీజేపీ పోరుడుతుందని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.
తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలకపాత్ర పోషించిందని… దేశాభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న మహనీయుడు నరేంద్ర మోదీ అని, తెలంగాణలో ప్రశ్నిస్తే.. పోలీసుల సమక్షంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విరుచుకుపడుతున్నారని, ఇదే ఆఖరి ఉద్యమం కాదు అనీ, అందరం కలిసి కూటమి కట్టుకుందామని, అందులో భాగమే ‘కోట్ల సంతకాల సేకరణ’ కార్యక్రమం ప్రారంభించామని, సేక కోటి సంతకాల సేకరణ అందులో భాగమేనని, మిలియన్ మార్చ్ ద్వారా మన సత్తా చాటుద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు.