HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Plans To Take On Kcr From All Fronts

Bandi Sanjay: ‘టీఆర్ఎస్’ అంతానికి ఇదే ఆఖరి పోరాటం 

‘‘తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. ఈ అరాచక పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు.

  • Author : Balu J Date : 05-04-2022 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bandi
Bandi

‘‘తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. ఈ అరాచక పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. టీఆర్ఎస్ పాలనను అంతం చేసేందుకు ఇదే ఆఖరి పోరాటం కావాలి. అందుకోసం బీజేపీ చేపడుతున్న పోరాటానికి ప్రజలంతా అండగా నిలిచారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించే ఇతర పార్టీల నేతలంతా కేసీఆర్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పాటు బీజేపీ గెలుపు కోసం తమవంతు కృషి చేయాలనే సంకల్పంతో పార్టీలోకి వస్తున్నారు. వారందరికీ హృదయ పూర్వకంగా బీజేపీలోకి స్వాగతిస్తున్నాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ సహా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఇవాళ(మంగళవారం) పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. భిక్షమయ్యకు తరుణ్ చుగ్ కాషాయం కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. తరుణ్ చుగ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తరుణ్ చుగ్, బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు సంకినేని వెంకటేశ్వర్ రావు, శ్యాంసుందర్, దాసరి మల్లేశం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు.

ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ సహా ఆయన అనుచరులంతా ఈరోజు బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. తరుణ్ చుగ్ పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో బీజేపీ గెలవాలని కార్యకర్తలంతా పోరాడుతున్నారు. ఈ తరుణంతో బీజేపీ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని భిక్షమయ్య చెప్పారు. తెలంగాణలో అరాచక, కుటుంబ, అవినీతి పాలన సాగుతోంది. ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. బీజేపీ పోరాటాలను ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న లక్ష్యం కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనను అంతం చేయడమే. ఇందుకోసం బీజేపీ చేస్తున్న పోరాటాలకు ప్రజలు అండగా ఉన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏం తప్పు చేశారని ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తోంది టీఆర్ఎస్ నేతలే. సీఎం నోటి నుండి వచ్చిన హామీలేవీ నెరవేరలేదు. ఆయన ఏం హామీలిచ్చారో ప్రగతి భవన్ ముందు ప్రొజెక్టర్ పెట్టి చూపాలి. రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వ నాశనం చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఆయనవల్ల తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.

కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెబుతున్నా వినకుండా రాజకీయం చేస్తున్నారు. కొడుకు సీఎం సీటు కోసం డాడీ డాడీ అంటుంటే…. కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ధాన్యం పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు బండి సంజయ్. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. దీని గురించి సీఎం ఎందుకు స్పందించడం లేదు. డ్రగ్స్ విషయంలోనూ కఠిన చర్యలేవి? మొక్కుబడిగా సమావేశాలు పెట్టి హడావుడి చేయడం తప్ప సమస్యను పరిష్కరించిన దాఖాలాల్లేవు. ప్రజల చర్చలను దారి మళ్లించేందుకే ధాన్యం పేరుతో నాటకాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బండి సంజయ్. జంతర్ మంతర్ కాదు కదా టీఆర్ఎస్ నేతలు విదేశాల్లో ధర్నాలు చేసుకున్నా వచ్చే ఇబ్బందేమీ లేదు. అయినా మేం ధాన్యం కొనబోం అని చెబితే కదా…. కేంద్రం ఎంత రారైస్ ఇచ్చినా కొనేందుకైనా సిద్ధంగా ఉంది. పీయూల్ గోయల్ కూడా పార్లమెంట్ లో ప్రకటించారు కదా. కానీ ధాన్యం పూటకోమాట చెబుతూ నాటకాలాడుతోంది కేసీఆరే, టీఆర్ఎస్ నేతలే… వరి పంట వేయాలని చెప్పేది వాళ్లే… సన్న వడ్లు వేయాలని చెప్పింది వాళ్లే. ఆ తర్వాత మాట మార్చి వరి వేస్తే ఉరే గతి అన్నది వాళ్లే… ధాన్యం కేంద్రానికి పంపేది లేదని చెబుతోంది వాళ్లే… ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తామని చెప్పింది వాళ్లే. ఇప్పుడు కేంద్రమే కొనాలంటూ గోల చేస్తోంది వాళ్లే. కరెంట్ బిల్లుల విషయంలో ప్రజలను దారి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి డ్రామాలాడుతున్నారని విమర్శించారు బండి సంజయ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • Ex MLA
  • hyderabad
  • Telangana BJP

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd