HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp New Strategy To Check Revanth Reddy In Telangana

BJP on Revanth: గురువుతో శిష్యునికి పోటు?

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఆయ‌న దూకుడును తగ్గించ‌డంతో పాటు కాంగ్రెస్ ను మ‌రింత బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి మాస్టర్ స్కెచ్ సిద్ధం అయింది. అందుకోసం, కాంగ్రెస్ లోని కొంద‌రు సీనియ‌ర్ల మీద బీజేపీ ఆప‌రేష‌న్ షురూ చేస్తోంది.

  • Author : CS Rao Date : 03-08-2022 - 12:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP-TS
Babu Revanth

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ల‌క్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఆయ‌న దూకుడును తగ్గించ‌డంతో పాటు కాంగ్రెస్ ను మ‌రింత బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి మాస్టర్ స్కెచ్ సిద్ధం అయింది. అందుకోసం, కాంగ్రెస్ లోని కొంద‌రు సీనియ‌ర్ల మీద బీజేపీ ఆప‌రేష‌న్ షురూ చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక‌ల క్ర‌మంలో జ‌రిగే ప‌రిణామాలు చిత్ర‌విచిత్రంగా మార‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. 2023 ఎన్నిక‌ల‌కు ట్రైల‌ర్ గా భావిస్తోన్న మునుగోడు ఉప ఎన్నికను స‌వాల్ గా బీజేపీ తీసుకుంది. ఎన్నిక‌ల తెర‌మీద ఒక గేమ్ ఆడుతూ వెనుక మ‌రో ఆట‌ను మొద‌లు పెట్టడానికి సిద్ధం అవుతోంది.

తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు స‌ల‌హాలు, సూచ‌న‌లు మునుగోడు ఉప ఎన్నిక సంద‌ర్భంగా తీసుకోవ‌డానికి బీజేపీ స‌న్నాహాలు చేస్తుంద‌ని వినికిడి. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్యాడ‌ర్ , లీడ‌ర్లు పూర్వ‌పు టీడీపీ కి చెందిన వాళ్లు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ పార్టీలో కీల‌కంగా ఉన్న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఒక‌ప్పుడు టీడీపీకి న‌ల్గొండ జిల్లాలో వెన్నుముక‌గా ప‌నిచేశారు. అంతేకాదు, టీఆర్ఎస్ పార్టీలోని ద్వితీయ‌శ్రేణి 80 శాతం టీడీపీ సానుభూతిప‌రులు. అందుకే, టీడీపీ మ‌ద్ధ‌తును ప‌రోక్షంగా తీసుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నాలు మొదలు పెట్టింది.

Also Read:  AP Minister Appalaraju: మహిళలకు అప్పలరాజు శాపనార్థం!

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు టీడీపీ పూర్వ‌పు క్యాడ‌ర్ తో మాత్రమే ప‌రిచయాలు ఎక్కువు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలోని కోర్ క్యాడ‌ర్ ఇంకా రేవంత్ నాయ‌క‌త్వాన్ని పూర్తిగా జీర్ణించుకోలేదు. పైగా వరంగ‌ల్ స‌భ సంద‌ర్భంగా ఆయ‌న ఇచ్చిన ప్రాధాన్యత‌ను తొలి నుంచి కాంగ్రెస్ లో ఉన్న క్యాడ‌ర్ గుర్తు చేసుకుంటోంది. ఆ స‌భ‌లో రేవంత్ రెడ్డి అనుచ‌రులు, గ్రూప్ కు మాత్ర‌మే ప్రాధాన్యం ల‌భించింద‌ని కాంగ్రెస్ కోర్ క్యాడ‌ర్ ఇప్ప‌టికీ చ‌ర్చించుకుంటోంది. తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ క్రీమ్ ను కేసీఆర్ ఆక‌ర్షించారు. మిగిలిన భాగాన్ని రేవంత్ రెడ్డి ఆక‌ట్టుకున్నారు. అదే ఆయ‌న‌కున్న సొంత బ‌లం. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన బీజేపీ ప‌రోక్షంగా చంద్ర‌బాబు ద్వారా మునుగోడులోని టీడీపీ పూర్వ‌పు క్రీమ్ మీద ఆప‌రేష‌న్ కొన‌సాగించాల‌ని స్కెచ్ వేస్తోంది.

మునుగోడులో చంద్ర‌బాబు ద్వారా చేయించే ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం అయితే, రాబోవు ఎన్నిక‌ల్లో నేరుగా టీడీపీతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా అధికారంలోకి రావాల‌ని బీజేపీ ఎత్తుగ‌డ‌. ప్ర‌స్తుతం దూకుడుగా ఉన్న రేవంత్ ను క‌ట్ట‌డీ చేయడానికి చంద్ర‌బాబు ను ప్ర‌యోగించాల‌ని క‌మ‌ల‌నాథులు వ్యూహాలు ర‌చించారు. తొలి నుంచి రేవంత్ రెడ్డి బ‌లం చంద్ర‌బాబు నాయుడు తోడుగా ఉండ‌డ‌మే. లేదంటే ఆయ‌న పీసీసీ చీఫ్ ప‌ద‌విని అందుకునే అవ‌కాశం ఉండేది కాద‌ని చాలా మంది చ‌ర్చించుకుంటారు. ఇప్ప‌టికీ పూర్వ‌పు తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ తోనే రేవంత్ రాజ‌కీయాల‌ను న‌డుపుతున్నారు. ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేకంగా క్యాడ‌ర్‌, లీడ‌ర్ల మ‌ద్ధ‌తు లేద‌ని కాంగ్రెస్ లోని సీనియ‌ర్ల భావ‌న‌. అదే, బీజేపీ కి ఉన్న స‌మాచారం కూడా. అందుకే, పూర్వ‌పు టీడీపీని త‌మ వైపు తిప్పుకోవ‌డానికి మునుగోడు నుంచి క‌మ‌ల‌నాథులు ప్ర‌య‌త్నాలు మొదలు పెట్టారు. అందుకోసం చంద్ర‌బాబును పావుగా ఉప‌యోగించుకోవాల‌ని మోడీ, షా ద్వ‌యం స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఫ‌లితాన్ని చూడాల్సిందే!

Also Read:  AP Classes Merger: ఒక వ‌ర్గం మీడియాపై జ‌గ‌న్ బాట‌న ఏపీ విద్యాశాఖ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • congress
  • revanth reddy
  • Telangana BJP

Related News

Mynampalli Rohith

Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

మెదక్ ఎమ్మెల్యే మైనంప‌ల్లి రోహిత్‌పై టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గ‌రారెడ్డి ప్రశంసలు కురిపించారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి మైనంపల్లి రోహిత్ వంటి యువ, డైనమిక్ నాయకత్వం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపే నాయకుడిగా రోహిత్ గుర్తింపు పొందారని జగ్గారెడ్డి అన్నారు. మెదక్ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృష

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • Indiramma Houses

    CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Latest News

  • South Coast Railway Zone: నెరవేరిన దశాబ్దాల నాటి కల.. ఏపీ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రారంభం

  • AP DSC : స్పోర్ట్స్ కోటా నియామకాలపై బహిరంగ చర్చకు సిద్ధం: SAAP చైర్మన్

  • Rahul Gandhi: సీబీఎస్‌ఈపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

  • TTD Admissions 2026: టీటీడీ సంగీత, నృత్య అడ్మిషన్లు దరఖాస్తులకు ఆహ్వానం

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ రికార్డులు ఇవే!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd