Kaleshwaram Project : ‘కాళేశ్వరం’ నిర్మాణమే తప్పు అంటున్న బీజేపీ ఎంపీ
Kaleshwaram Project : "ఈ ప్రాజెక్టును రూపొందించేటప్పుడు వాతావరణ శాస్త్రాన్ని కూడా పట్టించుకోలేదు. వర్షపాతం, వరదలు వంటి అంశాలపై స్పష్టత లేకుండానే నిర్మాణం చేపట్టారు" అని ఆరోపించారు
- By Sudheer Published Date - 07:19 PM, Wed - 11 June 25

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నిర్మాణంపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (MP Konda Vishweshwar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. “ఏ సైన్స్ ప్రకారం చూసినా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక తప్పులున్నాయి” అని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు యొక్క సిస్టమ్ డిజైన్ పూర్తిగా తప్పుగా ఉందని, ఇది ప్రాథమిక శాస్త్ర ప్రమాణాలకు కూడా అనుగుణంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Drugs Case : దివి కొంపముంచిన మంగ్లీ బర్త్ డే
. “జియో హైడ్రాలజీ (భూమి లోపలి నీటి ప్రవాహం), జియో హైడ్రోమార్ఫాలజీ (నీటి ప్రవాహం వల్ల ఏర్పడే భూభాగ మార్పులు), జియాలజీ (భూగర్భ నిర్మాణం), పోటమాలజీ (నదుల అధ్యయనం) ఇలా అన్ని శాస్త్రాల ప్రకారంగా తప్పులే కనిపిస్తున్నాయి” అని వివరించారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉపయోగించిన స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్, సివిల్, ఇరిగేషన్ ఇంజినీరింగ్ విధానాల్లో కూడా లోపాలున్నాయని అన్నారు.
“ఈ ప్రాజెక్టును రూపొందించేటప్పుడు వాతావరణ శాస్త్రాన్ని కూడా పట్టించుకోలేదు. వర్షపాతం, వరదలు వంటి అంశాలపై స్పష్టత లేకుండానే నిర్మాణం చేపట్టారు” అని ఆరోపించారు. ప్రాజెక్టు డిజైన్ లోపాల వల్ల భారీగా నష్టాలు వాటిల్లాయని, ప్రజాధనం వృథా అయిందని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.