MP Raghunandan Rao : మంత్రి పొంగులేటి పై బీజేపీ ఎంపీ ప్రశంసలు
MP Raghunandan Rao : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy)తీసుకువచ్చిన భూభారతి చట్టంపై ప్రశంసలు కురిపించారు
- By Sudheer Published Date - 11:01 AM, Sun - 18 May 25

మెదక్‌లో జరిగిన సమావేశంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy)తీసుకువచ్చిన భూభారతి చట్టంపై ప్రశంసలు కురిపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి వ్యవస్థను తీసుకువచ్చి రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో భూభారతి చట్టం ద్వారా నూతన మార్గం వేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రెవిన్యూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
Gold Rate In India: నేటి బంగారం ధరలు ఇవే.. రూ. 35,500 తగ్గిన గోల్డ్ రేట్?
రఘునందన్ రావు మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో రైతులు భూముల నమోదుకు, హక్కుల కోసం తల్లడిల్లారని పేర్కొన్నారు. ధరణి వ్యవస్థలో లోపాల వల్ల పలు సమస్యలు వచ్చాయని అన్నారు. రైతుల భూములను రిజిస్టర్ చేసుకోవడంలో నానా అవస్థలు ఎదుర్కొన్నారని, భూభారతి చట్టం వాటికి పరిష్కారంగా నిలవాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే ఇదే సమయంలో రఘునందన్ రావుపై 176 ఎకరాల లావణి, అసైన్డ్ భూముల వివాదం తెరపైకి వచ్చిన సంగతి ప్రస్తావనకు వచ్చింది. దుబ్బాక నియోజకవర్గంలోని చొదర్‌పల్లి గ్రామంలో దళితులు, వడ్డెరలకు చెందిన భూములను బెంబేలెత్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత ఈ భూములలో 84 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేరిట పట్టాలు తీసుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశంసలు అందించటం పై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.