HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Complains To Ec Against Cm

Minister Post To Azharuddin : అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

Minister Post To Azharuddin : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల కమిషన్‌ (EC) ను ఆశ్రయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది

  • Author : Sudheer Date : 30-10-2025 - 2:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Survey
Survey

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల కమిషన్‌ (EC) ను ఆశ్రయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉపఎన్నిక సమయంలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు చేస్తూ, అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్‌ చేసినట్లు మీడియా రిపోర్టులు వచ్చాయని బీజేపీ పేర్కొంది. ఇది ఎన్నికల నియమావళి (Model Code of Conduct – MCC) ఉల్లంఘనగా స్పష్టమని, వెంటనే ఈ ప్రక్రియను ఆపివేయాలని ఈసీని కోరింది.

Bengaluru : బెంగళూరులో దారుణం.. యువకుడిని వెంటాడి కారుతో ఢీ

బీజేపీ ఫిర్యాదులో ముఖ్యంగా పేర్కొన్న అంశం ఏమిటంటే.. అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేళ, ఆయనకు మంత్రి పదవి హామీ ఇవ్వడం ఎన్నికల సమయంలో ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నమని. ఇది నిష్పక్షపాత ఎన్నికల సూత్రాలకు వ్యతిరేకమని బీజేపీ వాదిస్తోంది. ముఖ్యమంత్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఈ చర్యతో ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరమైన ఉదాహరణ సృష్టించారని ఆరోపించింది. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్‌పై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేసింది.

ఇక ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వర్గాలు అయితే ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాయి. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవని, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొంటున్నాయి. మరోవైపు, బీజేపీ నేతలు మాత్రం “ఎన్నికల నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయి. సీఎం అయినా, అభ్యర్థి అయినా ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవు” అని హెచ్చరిస్తున్నారు. ఈసీ ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుందో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BJP complains to EC
  • cm revanth
  • congress
  • ec
  • Jubilee Hills by-election
  • Minister Post To Azharuddin

Related News

Prashant Kishor To Contest

Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

బీహార్‌లోని బంకిపుర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్లు జన్ సురాజ్ పార్టీ (జేఎస్‌పీ) రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి అధికారికంగా ప్రకటించారు.

  • Ktr Visit To Kannepalli Pum

    KTR : ఎలాంటి అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శిసా : కేటీఆర్‌

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd