HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Bc Atma Gourava Sabha On Nov 7

BC Atma Gourava Sabha : ఈ నెల 07 న హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ..

ఈ నెల 07 హైదరాబాద్ లో బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో భారీ సభకు ప్లాన్ చేసారు. బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటీకే ప్రకటించిన బిజెపి..ఇప్పుడు ఈ సభ ద్వారా ప్రధాని మోడీ చేత ప్రకటించాలని చూస్తుంది

  • Author : Sudheer Date : 02-11-2023 - 1:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bc Atma Gourava Sabha
Bc Atma Gourava Sabha

నవంబర్ 07 న హైదరాబాద్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభ (BC Atma Gourava Sabha) నిర్వహించబోతున్నట్లు..ఈ సభ కు ప్రధాని మోడీ (PM Modi) హాజరుకానున్నట్లు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (BJP MP Laxman) తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తుండగా.. బీజేపీ మాత్రం కాస్త వెనకపడింది. సగం మందికి పైగా అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దీనికి తోడు కీలక నేతలు కూడా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో పార్టీలో మళ్లీ జోష్ నింపేందుకు బిజెపి భారీ స్కెచ్ వేసింది.

ఈ నెల 07 హైదరాబాద్ లో బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో భారీ సభకు ప్లాన్ చేసారు. బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ఇప్పటీకే ప్రకటించిన బిజెపి..ఇప్పుడు ఈ సభ ద్వారా ప్రధాని మోడీ చేత ప్రకటించాలని చూస్తుంది. అలాగే బీసీ సీఎం మాత్రమే కాదు.. అభ్యర్థుల ఎంపికలోనూ బిజెపి ఆచితూచి వ్యవహరిస్తోంది. బీసీ అభ్యర్థులకు పెద్ద పీట వేస్తూ.. ఇతర పార్టీల్లా కాకుండా.. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా.. బీసీ ఓట్లను రాబట్టుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె నేడు మీడియా తో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఫై , రాహుల్ గాంధీ ఫై పలు విమర్శలు చేసారు. రాహుల్ గాంధీ బీసీలను అవమానపరిచారన్నారు. అవకాశం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వలేదన్నారు. బీసీలు బీజేపీకి (BJP) దగ్గరవుతారన్న అక్కసుతో రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారని విమర్శించారు. బీసీలు తమకున్న ఓటు ఆయుధంతో రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు (CM KCR) చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు (BRS) ప్రకటించే తాయిలాల కోసం తాము ఆరాటపడడం లేదని బీసీలు నిరూపించుకోవాలన్నారు. బీసీలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.

జనసేన (Janasena) తమ భాగస్వామ్య పార్టీ అని అన్న లక్ష్మణ్ పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులుంటాయని తెలిపారు. తెలంగాణలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రచారం చేయనున్నారని ఆయన తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వ్యూహం వల్లనే గెలిచామని లక్ష్మణ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందని, పొత్తుల్లో కొన్ని సీట్లు భాగస్వామ్య పార్టీలకు ఇస్తామన్న ఆయన రాష్ట్ర ప్రయోజనాలకే కాదు దేశ ప్రయోజనాలను కూడా తమ పార్టీ చూస్తుందని లక్ష్మణ్ తెలిపారు.

Read Also : Chandrababu : చంద్రబాబు ఫై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC Atma Gourava Sabha
  • hyderabad
  • pm modi
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd