BJP : తెలంగాణలో పలు జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
వీటిలో బీసీలకు 15 చోట్ల బీజేపీ అవకాశం కల్పించింది. ఓసీలకు 10 చోట్ల, రెడ్లకు 7చోట్ల, ఆర్యవైశ్యులకు 2 చోట్ల, కమ్మవారికి ఒక చోట అవకాశం కల్పించింది.
- By Latha Suma Published Date - 01:56 PM, Mon - 3 February 25

BJP : బీజేపీ అధిష్ఠానం తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. కార్యకర్తలు, నేతల అభిప్రాయ సేకరణ తర్వాత జిల్లా పార్టీ పగ్గాలను ఎవరి చేతుల్లో పెట్టాలన్న విషయంపై ఒక క్లారిటీకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణలో 27 జిల్లాలకు తమ పార్టీ అధ్యక్షులకు ప్రకటించింది. ఈ మేరకు అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. వీటిలో బీసీలకు 15 చోట్ల బీజేపీ అవకాశం కల్పించింది. ఓసీలకు 10 చోట్ల, రెడ్లకు 7చోట్ల, ఆర్యవైశ్యులకు 2 చోట్ల, కమ్మవారికి ఒక చోట అవకాశం కల్పించింది. ఎస్సీలను రెండు చోట్ల అధ్యక్షులుగా నియమించింది. అయితే 27 జిల్లాల్లో ఒకే ఒక చోట మహిళకు అవకాశం లభించింది.
బీజేపీ జిల్లా అధ్యక్షులు వీరే..
1.హైదరాబాద్ జిల్లా – లంకల దీపక్ రెడ్డి
2. భువనగిరి – అశోక్ గౌడ్
3. జనగామ – సౌడా రమేశ్
4. నల్గొండ – వార్షిత్ రెడ్డి
5. మేడ్చల్ – బీ శ్రీనివాస్
6. సిద్దపేట – గాగండి మోహన్ రెడ్డి
7. గోల్కొండ – ఉమామహేందర్
8. హన్మకొండ – సతీష్ రెడ్డి
9. భాగ్యనగర్ – శేఖర్ చంద్ర
10. సికింద్రాబాద్ – భారత్ గౌడ్
11. నిజామాబాద్ – దినేష్..
12. జగిత్యాల – యాదగిరి
13. వరంగల్ – గంట రవి..
14. మహబూబ్ నగర్ – శ్రీనివాస్
15. వనపర్తి – నారాయణ
16. భోపాలపల్లి – నిషిదర్ రెడ్డి..
17.ఖమ్మం – రవి కుమార్..
18. మహబూబ్ బాద్ – వెంకటేషర్లు..
19. ములుగు – బలరాం
20. మెదక్ – మహేశ్ గౌడ్
21. కామారెడ్డి – రాజు
22. సంగారెడ్డి -గోదావరి అంజిరెడ్డి
23.పెద్దపల్లి – సోమరము లావణ్య
24. అసిఫాబాద్ – శ్రీశైలం
25. మంచిర్యాల – వెంకటేశ్వర్లు గౌడ్
మరోవైపు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ ఆధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అనేక మందితో చర్చించిన తర్వాత పార్టీ నాయకత్వం ఈటల రాజేందర్ పేరు ఖరారు చేసినట్లుగా పార్టీలో చర్చ నడుస్తోంది. ఇదే సమయంలో మరో ఇద్దరు నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీ కొత్త సారథిగా నియమితులు అవ్వడం ఖాయమనే అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ నియామకంతో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని ఆశిస్తోంది.