BRS : బిఆర్ఎస్ లోకి పెరుగుతున్న వలసలు..పాలకుర్తిలో కాంగ్రెస్ కు బిగ్ షాక్
BRS : తెలంగాణ లో మళ్లీ బిఆర్ఎస్ (BRS) పుంజుకుంటుంది. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన ప్రజలు..రెండున్నర ఏళ్లలో వచ్చిన , చూసిన మార్పు తో మళ్లీ కేసీఆరే రావాలంటూ కార్ ఎక్కుతున్నారు. కీలక నేతల దగ్గరి నుండి కార్యకర్తల వరకు అంత బిఆర్ఎస్ వైపు చూస్తున్నారు
- By Sudheer Published Date - 08:50 PM, Sat - 4 October 25

తెలంగాణ లో మళ్లీ బిఆర్ఎస్ (BRS) పుంజుకుంటుంది. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన ప్రజలు..రెండున్నర ఏళ్లలో వచ్చిన , చూసిన మార్పు తో మళ్లీ కేసీఆరే రావాలంటూ కార్ ఎక్కుతున్నారు. కీలక నేతల దగ్గరి నుండి కార్యకర్తల వరకు అంత బిఆర్ఎస్ వైపు చూస్తున్నారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక స్థాయిలో తీరుతున్న నేతల మధ్య భేదాభిప్రాయాలు విస్తరిస్తున్నాయి. ఈ కారణంగా సొంత పార్టీ నేతలు విసిగి కొత్త వేదిక కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ స్థానిక స్థాయిలో బలహీనమవుతోందని స్పష్టమవుతోంది.
తాజాగా పాలకుర్తి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు తార హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఆమె అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో తారకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామం పాలకుర్తిలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ఓయూ నేత పృథ్వీ రెడ్డి కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం మరో చర్చనీయాంశంగా మారింది.
వీరిద్దరితో పాటు దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామం నుండి 120 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డి తీరు, అంతర్గత సమస్యల వల్లే పార్టీని విడిచామని వీరు పేర్కొన్నారు. ఈ పరిణామం పాలకుర్తిలో బీఆర్ఎస్ బలాన్ని పెంచుతుండగా, కాంగ్రెస్ స్థానిక శ్రేణులలో గందరగోళం సృష్టిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఇలాంటి మార్పులు కాంగ్రెస్ పార్టీ పునాదులను బలహీనపరచి, భవిష్యత్ ఎన్నికలలో బీఆర్ఎస్‌కి లాభం చేకూర్చే అవకాశం ఉంది.