Kavitha Bail : కవితకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇవాళ ఆ పిటిషన్‌ను పరిశీలించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
- By Pasha Published Date - 12:55 PM, Mon - 12 August 24

Kavitha Bail : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాళ ఆ పిటిషన్‌ను పరిశీలించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై స్పందన కోరుతూ ఈడీ, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
We’re now on WhatsApp. Click to Join
కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్‌గీ వాదనలు వినిపించారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 50 మంది నిందితుల్లో నేను ఏకైక మహిళను. ఒక తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు బెయిల్ ఇవ్వండి’’ అని తన న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టును కవిత(Kavitha Bail) కోరారు. అయితే కోర్టు ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక నిందితుడు ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు బెయిల్ ఇచ్చే ముందు కూడా ఈడీ, సీబీఐల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. తాజాగా ఇవాళ కవిత విషయంలోనూ ఆ రెండు కేంద్ర దర్యాప్తు సంస్థల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. దీన్నిబట్టి ఆగస్టు 20న కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read :ITBP Constable Jobs : 200 ఐటీబీపీ కానిస్టేబుల్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
కవితను మార్చి 15న ఈడీ హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె తిహార్ జైలులోనే ఉంటున్నారు. ఇక సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ జులై 1న ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. లిక్కర్ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు సాక్షులను ప్రభావితం చేసేందుకు కవిత యత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.