HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Big Shock For Brs In Miryalaguda

BRS : మిర్యాలగూడ లో బిఆర్ఎస్ కు భారీ షాక్

మిర్యాలగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్‌ దాదాపు 13 మంది కౌన్సిలర్లతో శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు

  • Author : Sudheer Date : 27-04-2024 - 3:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mgd
Mgd

లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) బిఆర్ఎస్ (BRS) సత్తా చాటబోతుందని..ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి ప్రజలు బాధపడుతున్నారని..కాంగ్రెస్ (Congress) వచ్చింది రాష్ట్రానికి కరువు వచ్చిందని..ఈ ప్రభుత్వం ఏడాది కొనసాగితే గొప్పే అని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అంటుంటే..నేతలు మాత్రం మాకు పార్టీ ఫై నమ్మకం లేదని చెప్పి వరుసగా బయటకు వస్తున్నారు. గత మూడు నెలలుగా భారీ ఎత్తున బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుండగా..ఇక ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైంది. మరో నెల రోజుల్లో ఖాళీ అవుతుందా ఏంటి అనుకునేలా నేతలంతా బయటకు క్యూ కడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మిర్యాలగూడ మున్సిపాలిటీ ఛైర్మన్ తిరునగర్ భార్గవ్‌ దాదాపు 13 మంది కౌన్సిలర్లతో శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు తిరునగర్ నాగలక్ష్మీ, మల్గం రమేష్, ఉదయ్ భాస్కర్, పత్తిపాటి సంధ్య, నవాబ్, సలీం, బంటు రమేష్, అమృతం దుర్గ సత్యం, బండ్ల దేవకమ్మ, చీదేళ్ళ సత్యవేణి, సాధిక బేగం, అయోద్య, ఉబ్బపల్లి వెంకమ్మ, కర్ర ఇందిరలు ఉన్నారు. వీరితో పాటు మాజీ మున్సిపాలిటీ ఛైర్మన్ మెరుగు రోషయ్య, మిర్యాలగూడ పీఏసీఎస్ ఛైర్మన్ బంటు శ్రీనివాస్ కూడా ఉన్నారు. 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లలో ఛైర్మన్‌తో పాటు 13 మంది ఒకేసారి పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీ ఛైర్మన్ హోదాను కొల్పోనుంది.

ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Read Also : CM Mamata Banerjee: హెలికాప్టర్ లో జారిపడ్డ సీఎం మమతా బెనర్జీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Lok Sabha Elections
  • Miryalaguda

Related News

Brs

Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గులాబీ పార్టీ, ఈసారి ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

  • Congress Hava

    Telangana Municipal Polls 2026 : మున్సిపల్ ఫలితాల్లో కాంగ్రెస్ హావ !!

  • Telangana Municipal Countin

    Telangana Municipal Counting : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపెవరిది ?

  • Municipal Polling Counting

    Municipal Polling Counting : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా జరుగుతుందంటే !!

Latest News

  • JD Lakshmi Narayana : కొత్త ఉద్యోగంలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ

  • ఐటీ దిగ్గజం అదిరిపోయే గుడ్‌న్యూస్..

  • భారత్‌పై ఓటమితో.. అసమర్థుల చేతిలో పాక్ క్రికెట్ బలి.. షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్

  • ఈ విజయం భారత్‌ కు అంకితం..కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

  • Double Bedroom House : తెలంగాణ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్ ?

Trending News

    • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

    • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    • భారత్-పాక్ మ్యాచ్‌.. మంచు ప్రభావం ఉంటుందా?

    • మహాశివరాత్రి నాడు పార్థివ శివలింగాన్ని ఎందుకు తయారు చేస్తారు?

    • రేప‌ట్నుంచి ఈ రాశుల‌వారికి ధన లాభంతో పాటు ఉద్యోగ అవకాశాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd