KCR : కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడు? – భట్టి
KCR : ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తోంది. పథకాలతో, సంక్షేమంతో ప్రజల ఆశల్ని నెరవేరుస్తోంది. తెలంగాణని తిరిగి అభివృద్ధి బాటలో నడిపించే ప్రభుత్వం ఇది
- Author : Sudheer
Date : 26-05-2025 - 7:09 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (KCR) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అచ్చంపేటలో నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన భట్టి.. “దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడు?” అంటూ ప్రశ్నించారు. ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టిన నాయకుడు దేవుడిగా ఎలా మారతాడని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు కష్టాలే మిగిలాయని ఆయన వ్యాఖ్యానించారు.
Poonam Kaur : పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ ?
ఇటీవల కేసీఆర్ కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలఫై కూడా భట్టి విక్రమార్క స్పందించారు. “కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఇప్పుడు కవిత చెబుతోంది. కానీ ఎన్నికలకే ముందే ప్రజలు ఆ దెయ్యాలను దులిపేసారు. కేసీఆర్ చుట్టూ ఉన్న వారి వల్లే ఆయన ప్రజల్లో నమ్మకం కోల్పోయారు” అని అన్నారు. ప్రజలే నిజమైన తీర్పుదారులని, వారు తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని గుర్తుచేశారు.
ప్రజలు ఇప్పుడు నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారని భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. “ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తోంది. పథకాలతో, సంక్షేమంతో ప్రజల ఆశల్ని నెరవేరుస్తోంది. తెలంగాణని తిరిగి అభివృద్ధి బాటలో నడిపించే ప్రభుత్వం ఇది” అని అన్నారు. గతంలో వచ్చిన దెయ్యాల పాలన తిరిగి రాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు.