Suicide : ఖమ్మం మమత మెడికల్ కాలేజీ హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య
ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. సముద్రాల మానస అనే 22 ఏళ్ల బీడీఎస్
- By Prasad Published Date - 08:36 AM, Mon - 5 June 23

ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. సముద్రాల మానస అనే 22 ఏళ్ల బీడీఎస్ విద్యార్థిని హాస్టల్ గదిలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్‌కు చెందిన మానస బీడిఎస్ చివరి సంవత్సరం చదువుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కళాశాల ఆవరణలోని హాస్టల్‌లో నివాసం ఉంటున్న మానస నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. మానస నేలపై కుప్పకూలినట్లు తోటి విద్యార్థులు గుర్తించారు. వెంటనే వారు 108 మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్‌ను సంప్రదించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే మాసన పూర్తిగా కాలిపోయి విగతజీవిగా కనిపించింది. ఈ హృదయ విదారక ఘటనపై వరంగల్‌లోని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆమె మృతిని అనుమానస్సద మృతిగా ఖమ్మం టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక విచారణలో తేలింది.