Basar IIIT: బాసర త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కీలక నిర్ణయం…ఇక నుంచి రాత్రంతా నిరసనలు..!!
సమస్యలను పరిష్కరించాలంటూ బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు ఐదు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
- By hashtagu Published Date - 10:38 PM, Sun - 19 June 22
సమస్యలను పరిష్కరించాలంటూ బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు ఐదు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే త్రిపుల్ ఐటీని వీసీని కూడా సర్కార్ నియమించింది. అయినా విద్యార్థులు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 24గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనలు తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నారు. వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా బయటే ఉండి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాము చెబుతున్న 12 డిమాండ్లను పరిష్కరించాలంటూ…ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. రాత్రంతా బయటే ఉండి తమ నిరసనను తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గత ఐదు రోజులుగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరసన తెలియజేశారు. కానీ ఈరోజు రాత్రంతా నిరసన దీక్ష చేపట్టాలని నిర్ణయించామని విద్యార్థులు చెబుతున్నారు.