Bandi Sanjay : దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డి అరెస్ట్.. బండి సంజయ్ ఫైర్..
కిషన్ రెడ్డి అరెస్టుని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. కిషన్ రెడ్డి అరెస్టుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Author : News Desk
Date : 13-09-2023 - 10:00 IST
Published By : Hashtagu Telugu Desk
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్(CM KCR) అన్యాయం చేశాడంటూ, నిరుద్యోగులకు అండగా ఉంటామని, . ఉద్యోగ కల్పనకై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని నిరసిస్తూ నేడు తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) పార్టీ ఇందిరా పార్క్ వద్ద శాంతియుత ఉపవాస దీక్ష చేపట్టింది. 24 గంటల పాటు దీక్షను కొనసాగించాలని నిర్ణయించారు.
నేడు ఉదయం నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆధ్వర్యంలో దీక్ష మొదలైంది. అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసులు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దీక్షకు అనుమతి ఉందంటూ పోలీసులు దీక్షా శిబిరం వద్ద హడావిడి చేయగా పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. దీంతో పోలీసులు కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
కిషన్ రెడ్డి అరెస్టుని బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండించింది. కిషన్ రెడ్డి అరెస్టుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బండి సంజయ్(Bandi Sanjay) కిషన్ రెడ్డి అరెస్ట్ పై మాట్లాడుతూ నిరాహార దీక్ష చేస్తున్న కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేస్తారా?, CM కేసీఆర్ నిరుద్యోగులకు చేసిన మోసాలను దీక్ష ద్వారా ఎండగడుతుంటే తట్టుకోలేకే ఈ అరెస్టులు. రజాకార్ల పాలనకు చరమ గీతం పాడే సమయం వచ్చింది అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
Also Read : BJP Hunger Strike: కిషన్ రెడ్డి అరెస్ట్