Bandi Sanjay : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ ఏమన్నాడు?
తెలంగాణ(Telangana) బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్ గురించి మాట్లాడుతూ..
- By News Desk Published Date - 07:00 PM, Sat - 13 May 23

కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్(Congress) భారీ విజయం దక్కించుకుంది. ఇప్పటికే అనేక సీట్లను గెలవగా, మ్యాజిక్ ఫిగర్ దాటి మరీ ఇంకొన్ని సీట్లలో లీడ్ లో ఉంది కాంగ్రెస్. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ఇంతటి భారీ విజయాన్ని చూడటంతో కాంగ్రెస్ అగ్ర నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ కర్ణాటక ఫలితాలపై దేశవ్యాప్తంగా పలువురు నాయకులు స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటున్నారు.
తెలంగాణ(Telangana) బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కర్ణాటక ఎలక్షన్స్ రిజల్ట్ గురించి మాట్లాడుతూ.. దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు. కర్ణాటకలో మా ఓట్లు తగ్గలేదు, 36 శాతం ఓట్లు సాధించాము. కాంగ్రెస్ కి 5 శాతం ఓటింగ్ మాత్రమే పెరిగింది. JDS కి 7శాతం ఓట్లు తగ్గాయి. కర్ణాటకలో అన్ని పార్టీలు కలిసి మతతత్వ రాజకీయాలు చేశాయి. కానీ మమ్మల్ని అంటున్నాయి. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని ఓడించాయి. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని, ముస్లిం రిజర్వేషన్లు అని మతతత్వ రాజకీయాలు వాళ్ళు చేశారు. JDS అధ్యక్షుడు బహిరంగంగా చెప్పారు JDS ఓట్లు కాంగ్రెస్ కి వేయాలని. MIM కాంగ్రెస్ కోసం పనిచేసింది. రేపు భజరంగ్ దళ్ ని నిషేదించి, PFI పై నిషేధం ఎత్తివేస్తారు. 4శాతం ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రేపు తెలంగాణలో కూడా కలిసే పోటీ చేస్తాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ హైదరాబాద్ లో పెట్టేందుకు కేసీఆర్ సహాయం చేస్తారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి, JDS కి డబ్బులు సహాయం చేసింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై BRS, కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : Telangana Congress : కర్ణాటక ఫలితాలపై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే?