N Convention Demolition : రూ.400 కోట్లు ఇవ్వనందుకే N కన్వెన్షన్ కూల్చేశారు – బల్క సుమన్
N Convention Demolition : ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఏంటంటే నాగార్జున రూ.400 కోట్లు ఇవ్వనందుకే కూల్చివేస్తున్నారనే చర్చ జరుగుతుందన్నారు
- By Sudheer Published Date - 08:04 PM, Wed - 18 September 24

Balka Suman Reveals N Convention Demolition : రూ.400 కోట్లు ఇవ్వనందుకే సినీ నటుడు నాగార్జున (Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ (N Convention) కూల్చారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ (Balka Suman) కీలక ఆరోపణలు చేసారు. హైడ్రా (Hydraa) వ్యవస్థ ను తీసుకొచ్చిన సీఎం రేవంత్..నాగార్జున కు చెందిన ఎన్-కన్వెన్షన్‌ను కూల్చివేసి అందరికి షాక్ ఇచ్చాడు. కన్వెన్షన్ సెంటర్ బఫర్ జోన్‌లో నిర్మించబడింది. అయితే దీనిపై సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్-కన్వెన్షన్ 10 ఎకరాల్లో నిర్మించబడింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (నార్త్ ట్యాంక్ డివిజన్) ప్రకారం, తమ్మిడి కుంటలోని ఎఫ్‌టిఎల్ విస్తీర్ణం 29.24 ఎకరాలు, ఎన్-కన్వెన్షన్ ద్వారా ఎఫ్‌టిఎల్‌లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాలు ఆక్రమణలు జరిగాయి. దీంతో హైడ్రా..ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసి కబ్జా దారులకు చెమటలు పట్టించింది. దీని తరువాత అనేక నిర్మాణాలు కూల్చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఫై నాగార్జున ట్విట్టర్ వేదికగా స్పందించారు. స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేయడం బాధాకరమన్నారు. ‘‘మా ప్రతిష్ఠను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను అందరికీ తెలియజేయడం కోసం నేను ఈ ప్రకటన జారీ చేస్తున్నాను’’ అని ఆయన తెలిపారు. ‘‘ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించినది పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది’’ అని నాగార్జున స్పష్టం చేశారు. దీని తర్వాత నాగార్జున సైలెంట్ అయ్యాడు. కోర్ట్ చూసుకుంటుందని..దీనిని పెద్ద ఇష్యూ చేయకుండా సైలెంట్ అయ్యాడు.
తాజాగా మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్..దీనిపై స్పందించి మరోసారి వార్తల్లో నిలిచేలా చేసాడు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎఫ్‌టీఎల్ జోన్‌లో ఉందని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టారు. అయితే హిమాయత్ సాగర్‌లో ఆనంద కన్వెన్షన్ ఉంది. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టిన ఈ మొగోడు, సిఫాయి, హైదరా బాద్‌లోని చెరువులను రక్షించే రక్షడు రేవంత్ రెడ్డి(Revanth reddy) ఆనంద కన్వెన్షన్‌ను ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఏంటంటే నాగార్జున రూ.400 కోట్లు ఇవ్వనందుకే కూల్చివేస్తున్నారనే చర్చ జరుగుతుందన్నారు. ఆనంద కన్వెన్షన్ వాళ్లు ముడుపులు ముట్ట చెప్పినందుకే కూల్చలేదని ఆరోపించారు. మాదాపూర్‌లోని సున్నం చెరువు దగ్గర దళిత బిడ్డలు ఇండ్లు కూలగొట్టావు. మహబూబ్‌నగర్‌లో కూలగొట్టావు. కానీ గండిపేట చెరువులో 18 ఎకరాల్లో కట్టిన మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ చెరువును ఆక్రమించి ఫాంహౌజ్, గోల్ఫ్ కోర్స్ నిర్మిస్తే ఎందుకు కూలగొట్టవని సూటిగా ప్రశ్నించారు. పేదల ఇండ్లు కూల్చేందుకు రంగనాథ్‌కు, సీఎం బుల్డోజర్లు దొరుకుతవి. కానీ, వివేక్ ఇంటిని ముట్టుకోవడానికి దొరుకవా అని ప్రశ్నించారు. పేదలకు ఒక నీతి, మీడియా అధిపతులకు, పారిశ్రామిక వేత్తలకు ఇంకో నీతా అని నిలదీశారు.