Balapur Laddu Highest Record: రికార్డు సృష్టించిన ‘బాలాపూర్ గణేశ్ లడ్డూ’
వినాయకుడి లడ్డూ అనగానే భాగ్యనగర వాసులందరికీ గుర్తుకువచ్చేది మొదట బాలాపూర్ లడ్డూనే.
- By Balu J Published Date - 11:28 AM, Fri - 9 September 22

వినాయకుడి లడ్డూ అనగానే భాగ్యనగర వాసులందరికీ గుర్తుకువచ్చేది మొదట బాలాపూర్ లడ్డూనే. ఈ ఏడాది కూడా బాలాపూర్ గణేశ్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను రూ.24.60లక్షలకు దక్కించుకున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో గణేశ్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. తొలుత రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట.. 2021లో రికార్డు స్థాయికి చేరి రూ.18.90 లక్షలు పలికింది. తాజాగా దాన్ని అధిగమించి ఏకంగా రూ.24.60లక్షలు పలకడం విశేషం.
Related News

Balapur Ganesh Laddu Auction : నేడు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం.. ఈ సారి కూడా రికార్డుస్థాయి ధర పలికే ఛాన్స్
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ఘనంగా ప్రారంభమైంది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయత్ర ట్యాంక్‌బండ్ వైపు