TS : దారుణం..కూతురు ప్రేమలో పడిందని…చేతులు కట్టేసి…!!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు.
- By hashtagu Published Date - 06:58 AM, Wed - 26 October 22

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. తనకు ఇష్టం లేని వ్యక్తిని ప్రేమించిందని ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కన్నకూతురుని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పెబ్బేరు మండలం పాతపల్లిలో జరిగింది. కాళ్లు,చేతులు కట్టేసి గొంతు కోసి చంపాడు. పాతపల్లికి చెందిన యువకుడిని బాధితురాలు ప్రేమిస్తుంది. ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.