Whats Today : తెలంగాణలో మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం ప్రచారం
Whats Today : ఇవాళ సాయంత్రంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సోషల్ మీడియాలోనూ యాడ్స్‌కు అనుమతి ఉండదు.
- By Pasha Published Date - 08:56 AM, Tue - 28 November 23

Whats Today : ఇవాళ సాయంత్రంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సోషల్ మీడియాలోనూ యాడ్స్‌కు అనుమతి ఉండదు.
- ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో రోడ్ షో, కార్నర్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్, మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్‌గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
- ఇవాళ సంగారెడ్డి జిల్లాలో ప్రియాంకా గాంధీ పర్యటిస్తారు. జహీరాబాద్ లో జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు.
- ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
- ఇవాళ చేగుంట, సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
- ఇవాళ తెలంగాణలో బీజేపీ నేతలు సుడిగాలి ప్రచారం చేస్తారు. హనుమకొండ బీజేపీ అభ్యర్థి శ్రీమతి రావు పద్మ మద్దతుగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, నిజామాబాద్ అర్బన్ లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అన్నామలై, సంగారెడ్డి నియోజకవర్గంలో కేంద్రమంత్రి భగవత్ ఖూబ జీ, దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేటలలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఆదిలాబాద్, ధర్మపురి నియోజకవర్గాల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రచారం చేస్తారు.
- ఇవాళ అమలాపురం నుంచి ముమ్మిడివరం వరకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర(Whats Today) జరుగుతుంది.