Asaduddin’s master plan : కేసీఆర్ కోసం MIM `కింగ్ మేకర్` అస్త్రం!
కేసీఆర్ ,బీజేపీ అడుగులో అడుగు వేయడానికి ఎంఐఎం(Asaduddin's master plan) సిద్దమవుతోంది.కింగ్ మేకర్ కాబోతున్నామని అసరుద్దీన్ ప్రకటించారు
- By CS Rao Published Date - 05:16 PM, Mon - 26 June 23

తెలంగాణ సీఎం కేసీఆర్ , బీజేపీ అడుగులో అడుగు వేయడానికి ఎంఐఎం (Asaduddin‘s master plan) సిద్దమవుతోంది. రాబోయే ఎన్నికల్లో కింగ్ మేకర్ కాబోతున్నామని అసరుద్దీన్ ప్రకటించారు. అంతేకాదు, వీలున్నని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దమవుతున్నామని వెల్లడించారు. దీంతో తెలంగాణ రాజకీయాలు మలుపులు తిరగనున్నాయని తెలుస్తోంది. రెండు సార్లు సీఎం కావడానికి ఎంఐఎం తెరవెనుక సహకారం సంపూర్ణంగా కేసీఆర్ కు అందించింది. కానీ, ఈసారి కింగ్ మేకర్ కావాలని ఆ పార్టీ ప్రకటించడం బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహంలో భాగం.
తెలంగాణ సీఎం కేసీఆర్ , బీజేపీ అడుగులో అడుగు వేయడానికి ఎంఐఎం (Asaduddin’s master plan)
ప్రస్తుతం ఉన్న సర్వేల సారాంశం ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ సమాన బలంతో ఉన్నాయి. ఆ రెండు పార్టీలకు 45 ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఎంఐఎం ఏడు స్థానాలను కైవసం చేసుకుంటుంది. కేవలం 18 మంది ఎమ్మెల్యేలను మాత్రం బీజేపీ గెలుచుకుంటుందని సర్వేల అంచనా. ఫలితాలు కనుక, సర్వేలకు అనుగుణంగా ఉంటే ఎంఐఎం ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతుంది. అదే అంచనాతో బహుశా అసరుద్దీన్ వ్యూహాలను (Asaduddin’s master plan)మార్చుకుంటున్నారా? బీజేపీ, బీఆర్ఎస్ గీసిన గీతలో నడుస్తున్నారా? అనేది సందిగ్ధం.
అసరుద్దీన్ కనీసం 45 చోట్ల పోటీ చేయాలని
ఉమ్మడి ఏపీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎంఐఎం ఎప్పుడూ ఏడు స్థానాలను మాత్రమే గెలుచుకుంటూ వస్తోంది. అత్యధికంగా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ఏడు మాత్రమే. కానీ, ఈసారి హైదరాబాదు తో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా పోటీ చేయాలని వ్యూహాలను రచిస్తోంది. కనీసం 45 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తే బీజేపీ బలపడే అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకు పడిపోతుంది. మూడోసారి సీఎం కావడానికి కేసీఆర్ కు అనుకూలంగా ఉంటుంది. అందుకే, సహజ మిత్రునిగా ఉన్న అసరుద్దీన్ కనీసం 45 చోట్ల పోటీ చేయాలని ప్రాథమికంగా (Asaduddin‘s master plan) నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
ముస్లిం ఓటర్లు కేసీఆర్ వైపు గత రెండు ఎన్నికల్లో Asaduddin’s master plan
గతంలో కాంగ్రెస్ పార్టీకి బలంగా మైనార్టీల ఓటు బ్యాంకు ఉండేది. ప్రత్యేకించి ముస్లింలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు ఉండే వాళ్లు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఉండేవి. ఫలితంగా ముస్లిం ఓటు బ్యాంకు చీలిపోకుండా ఎంఐఎం , కాంగ్రెస్ అభ్యర్థులకు ఉండేది. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తరువాత ఎంఐఎం, కాంగ్రెస్ పొత్తు అనేది ప్రశ్నార్థం అయింది. సహజ మిత్రునిగా కేసీఆర్ కు ఎంఐఎం మారింది. దీంతో ఎంఐఎంకు దూరంగా ఉండే ముస్లిం ఓటర్లు కేసీఆర్ వైపు గత రెండు ఎన్నికల్లో వెళ్లాయి. ఇదే ఈక్వేషన్ తో వెళితే, ఈసారి వర్కౌట్ కాదని కేసీఆర్, అసరుద్దీన్ అంచనా (Asaduddin’s master plan) వేస్తున్నారట.
అసరుద్దీన్, కేసీఆర్ కలిసి కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం వ్యూహాలను
ఎంఐఎం పోటీచేయని నియోజకవర్గాల్లో ఈసారి ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లనుందని నిర్థారణ అవుతోది. ఆ విషయాన్ని కర్ణాటక ఫలితాల తరువాత కేసీఆర్, ఎంఐఎం గ్రహించాయి. అందుకే, ముస్లిం ఓటు బ్యాంకును చీల్చడానికి ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీకి నిలవనుంది. ఎందుకంటే, బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ఉందని స్ట్రాంగ్ గా ప్రజల్లోకి వెళ్లింది. బీఆర్ఎస్ కు వేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని భావిస్తున్న పరిస్థితి ఉంది. అందుకే, కాంగ్రెస్ కు పడే ఓట్లను ఎంఐఎం అభ్యర్థుల ద్వారా చీల్చడానికి (Asaduddin’s master plan) మాస్టర్ స్కెచ్ వేశారు అసరుద్దీన్, కేసీఆర్. వాళ్లిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం వ్యూహాలను రచిస్తున్నారు.
Pawan in BJP’s strategy : సోము వ్యాఖ్యలతో పొత్తుపై కొత్త కోణం!
సర్వేల ప్రకారం బీజేపీ తెలంగాణ వ్యాప్తంగా బలహీన పడింది. ఆ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేల లోపు వచ్చే అవకాశం ఉందిన సర్వేల సారాంశం. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంటుంది. కాంగ్రెస్ కాకుండా ఏ పార్టీ వచ్చినా బీజేపీకి సానుకూలమే. అందుకే, కేసీఆర్ కు పరోక్షంగా సహకారం అందించడానికి బీజేపీ సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఒక వైపు బీజేపీ మరో వైపు ఎంఐఎం సహకారంతో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దెబ్బతీయాలని చీకటి రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. వాటిని అమలు చేసే క్రమంలో కింగ్ మేకర్ కాబోతున్నామని (Asaduddin’s master plan) అసరుద్దీన్ ప్రకటించడాన్ని కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది. సహజ మిత్రులు బంధాన్ని కాంగ్రెస్ ఎలా తట్టుకుంటుందో చూడాలి.
KCR Strategy: కేసీఆర్ ‘కాపు’ రాజకీయం.. కాపు భవన్ తో ఆంధ్రులకు గాలం!