HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Are There Differences Between Ktr And Kavitha Whats Truth

KTR Vs Kavitha: కేటీఆర్, కవిత మధ్య కోల్డ్‌వార్.. ఈ ప్రచారంలో నిజమెంత?

తెలంగాణ జాగృతి ద్వారా కల్వకుంట్ల కవిత(KTR Vs Kavitha) అమలుచేస్తున్న సామాజిక పోరాట కార్యాచరణను రాజకీయ పండితులు అభినందిస్తున్నారు.

  • Author : Pasha Date : 26-04-2025 - 2:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr Vs Kavitha Kcr Brs Telangana

KTR Vs Kavitha: బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయా ? ఆ వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందా ? కవిత, కేటీఆర్‌ల మధ్య పొలిటికల్ విషయాల్లో దూరం ఏర్పడిందా?  అనే కోణంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వారసత్వాన్ని అందుకునేందుకు కవిత, కేటీఆర్‌లు పోటీపడటం అనేది సర్వసాధారణ విషయం. రాజకీయాల్లో పురుషులతో సమానంగా మహిళలూ రాణించగలరు. ఈ వాదనతో ఎవరూ విభేదించరు. ఇందిరాగాంధీ, రాణీ రుద్రమా దేవి  లాంటి గొప్ప నాయకురాళ్లను మనదేశం ఇచ్చింది. కవితలోనూ గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆమెకు మాత్రం బీఆర్ఎస్ పగ్గాలను ఎందుకు అప్పగించకూడదు ? అని ప్రశ్నించే బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. అయితే వారిలో కొందరు ఇప్పుడే బయటికి వచ్చేందుకు సాహసం చేయడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌పై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టు కొనసాగుతోంది.

Also Read :YSR Jagananna Colonies : జగనన్న కాలనీల బాగోతం బట్టబయలు.. అసలు నిజం ఇదీ

కవితకు అన్నీ సానుకూలతలే.. 

తెలంగాణ జాగృతి ద్వారా కల్వకుంట్ల కవిత(KTR Vs Kavitha) అమలుచేస్తున్న సామాజిక పోరాట కార్యాచరణను రాజకీయ పండితులు అభినందిస్తున్నారు. ఇదే తరహాలో ఆమె ముందుకుసాగితే తప్పకుండా తెలంగాణలో బలమైన రాజకీయ నేతగా ఎదుగుతారని చెబుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పగ్గాలు దక్కకపోయినా.. సొంత రాజకీయ పక్షం ఏర్పాటు చేసేంత నెట్‌వర్క్ కవితకు సమకూరొచ్చు. బీసీలకు రిజర్వేషన్ల అంశంలో, కులగణనపై కవిత చాలా క్లారిటీతో జనంలోకి వెళ్తున్నారు. భవిష్యత్తులో కవిత ఏ రకమైన రాజకీయ వైఖరిని తీసుకున్నా.. ఈ అంశం సానుకూలంగా పరిణమించే ఛాన్స్ ఉంటుంది.

Also Read :AP Debts : కూటమి సర్కారుపై విషం కక్కిన బుగ్గన.. అప్పులపై అబద్ధాలు

క్లారిటీ ఇచ్చిన హరీశ్ రావు 

‘‘కేటీఆర్, కవిత మధ్య విభేదాలు లేవు. అదంతా తప్పుడు ప్రచారం. మా పార్టీ అంటే గిట్టని వాళ్లు  సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా పార్టీలో సమస్యలు సృష్టించాలని చూస్తున్న వాళ్లే ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్, కవిత మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదు. నేటి రాజకీయాల్లో నిజం కంటే అబద్ధాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి. గతంలో బీఆర్ఎస్ గురించి కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలే జరిగాయి. మొదట్లో ప్రజలు వాటిని నమ్మారు. అయితే ఏడాది కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత, ప్రజలు ఇప్పుడు రెండు ప్రభుత్వాల పాలనను పోల్చుకుంటున్నారు. తేడాను గ్రహిస్తున్నారు. వాస్తవం తెలిసినప్పుడు, నిజం నిలబడుతుంది. ఈ వివాదాల వెనుక ఉన్న నిజం త్వరలోనే ప్రజలకు తెలుస్తుంది’’ అని హరీశ్ రావు కామెంట్స్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • kavitha
  • kcr
  • ktr
  • KTR Vs Kavitha
  • telangana

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd