Amit Shah : తెలంగాణ బీజేపీ నేతలకు వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా..
- By Sudheer Published Date - 04:07 PM, Thu - 28 December 23

బిజెపి కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah )…తెలంగాణ బిజెపి నేతలకు (Telangana BJP Leaders) స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి..ఈ క్రమంలో తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో భేటీ అయ్యేందుకు గాను మధ్యాహ్నం హైదరాబాద్ (Hyderabad) కు చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా కు.. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి చేరుకొన్న ఆయన..అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ నేతలకు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అలాగే సిట్టింగ్ ఎంపీలు అదే స్థానాల నుండి పోటీ చేయాలనీ.. ఎంపీ ఎన్నికల్లో అందరు కలిసి పని చేయాలని నేతలకు సూచించినట్లు తెలుస్తుంది. దీంతో నిజామాబాద్ నుంచి అర్వింద్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు బరిలో దిగడం దాదాపు ఖరారైంది.
Read Also : AP : జనవరి 11 న నరసరావుపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ