Hyderabad: ఆన్‌లైన్‌లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకున్న శృంగార డిజిటల్ రాకెట్ కలకలం రేపుతోంది. ఆన్‌లైన్‌లో స్వీయంగా చిత్రీకరించిన నగ్న వీడియోలను విక్రయిస్తూ నిందితులు డబ్బు సంపాదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
- By Kavya Krishna Published Date - 12:39 PM, Thu - 26 June 25

Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకున్న శృంగార డిజిటల్ రాకెట్ కలకలం రేపుతోంది. ఆన్‌లైన్‌లో స్వయంగా చిత్రీకరించిన నగ్న వీడియోలను విక్రయిస్తూ నిందితులు డబ్బు సంపాదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం సొసైటీకి హానికరం కావడమే కాకుండా నైతిక విలువలకు నష్టం కలిగిస్తోందని పోలీసుల వ్యాఖ్య.
పోలీసుల కథనం ప్రకారం, అంబర్‌పేటకు చెందిన ఓ భార్యాభర్త కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా నగ్న వీడియోలు ప్రసారం చేస్తూ ఈ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వీరిలో ఆసక్తి చూపిన వారికీ డబ్బులు చెల్లించిన పక్షంలో ప్రత్యేక వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్ లింకులు పంపుతున్నట్లు గుర్తించారు.
గురువారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యూహాత్మకంగా నిందితుల ఇంటిపై దాడి నిర్వహించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి హై-డెఫినిషన్ కెమెరాలు, లైవ్ ప్రసారానికి ఉపయోగించే పరికరాలు, ఇతర డిజిటల్ సాధనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని, దంపతులకు మద్దతుగా ఉన్న ఇతరులు ఎవైనా ఉన్నారా అనే కోణంలో విచారణ జరుగుతోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Sonia Gandhi : ఇరాన్‌పై అమెరికా దాడులను తీవ్రంగా ఖండించిన సోనియా గాంధీ