HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Amazon To Invest Rs 60000 Cr In Hyderabad

Davos : తెలంగాణలో అమెజాన్ రూ.60వేల కోట్ల పెట్టుబడులు

Davos : అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు సమావేశమయ్యారు

  • Author : Sudheer Date : 23-01-2025 - 3:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Davos 2025
Davos 2025

దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రపంచంలోనే పేరు గాంచిన సంస్థల ప్రతినిధులను ఒప్పిస్తూ తన మార్క్ కనపరుస్తున్నారు. తాజాగా మరో సంస్థతో ఏకంగా రూ. 60 వేల కోట్ల పెట్టుబడులను సాధించారు. హైదరాబాద్ లో ఏకంగా రూ.60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ సంస్థ(Amazon to invest Rs 60,000 Cr in Hyderabad) ముందుకొచ్చింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకుంది.

Telangana Record In Davos: దావోస్‌లో తెలంగాణ స‌రికొత్త రికార్డు.. 46 వేల మందికి జాబ్స్‌!

అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు సమావేశమయ్యారు. డేటా సెంటర్ల విస్తరణకు అవసరమైన మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని కేటాయించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా 2030 నాటికి అమెజాన్ 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో హైదరాబాద్‌ను డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే మూడు డేటా సెంటర్లను ప్రారంభించిన అమెజాన్, తాజా ఒప్పందంతో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి ఈ ఒప్పందం గురించి మాట్లాడుతూ.. ఈ పెట్టుబడులు తెలంగాణ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తాయని, ఇది ప్రజా ప్రభుత్వ విజయాన్ని ప్రతిబింబిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.

అలాగే ఇన్ఫోసిస్ సంస్థ కూడా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలను ప్రకటించింది. పోచారంలో ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థ ప్రణాళిక రూపొందించింది. ప్రథమ దశలో రూ.750 కోట్ల పెట్టుబడితో ఐటీ భవనాల నిర్మాణం చేపట్టనుంది. ఇలా పెద్ద ఎత్తున భారీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండడం పట్ల రాష్ట్ర ప్రజలు , ముఖ్యంగా నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazon
  • Amazon telangana 60000 cr
  • Amazon Web Services
  • cm revanth
  • Davos
  • Telangana Data Centers

Related News

Gandhi Sarovar Musi

Gandhi Sarovar : వారం రోజుల్లో ‘గాంధీ సరోవర్’కు శంకుస్థాపన!

గాంధీ సరోవర్ పరిసరాల్లో ఆధ్యాత్మికతను చాటేలా ఒక భారీ మసీదు నిర్మాణానికి కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మసీదు నిర్మాణానికి సౌదీ అరేబియా యువరాజు సహకరించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

  • Cm Revanth Vs Aravind

    CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

  • Induction cooktops sell out in India as LPG crisis

    గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • చెరకు రసం తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

  • ఇన్‌స్టాగ్రామ్ వాడేవారికి బిగ్ అప్డేట్‌!

  • బీసీసీఐ అవార్డ్స్.. ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’గా శుభ్‌మన్ గిల్, స్మృతి మంధాన!

  • నిర్మాతగా నేను నష్టపోయాను విజయ్ సేతుపతి

  • గౌత‌మ్ గంభీర్‌కు వార్నింగ్ ఇచ్చిన గంగూలీ!

Trending News

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd