HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Alliance Congress Brs Words And Hands Towards Alliance

Alliance: పొత్తు దిశగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటలు, చేతలు!

కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పొత్తు దాదాపుగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ ప్రచారం నిజం కానుందని జానా రెడ్డి మాటల ద్వారా అర్థం అవుతుంది.

  • Author : CS Rao Date : 01-04-2023 - 9:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress, Brs Words And Hands Towards Alliance..!
Congress, Brs Words And Hands Towards Alliance..!

కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ పొత్తు (Alliance) దాదాపుగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తుంది. సుదీర్ఘంగా సాగుతున్న ఈ ప్రచారం నిజం కానుందని జానా రెడ్డి (Janareddy)మాటల ద్వారా అర్థం అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పొత్తుకు సానుకూలత ఉంది. ఆ విషయాన్ని తాజా అధ్యక్షుడు ఖర్గే నుంచి ఇటీవల వినిపించింది. ఇటీవల జరిగిన రాయపూర్ సభలోనూ పొత్తుల అంశాన్ని స్పష్టం చేశారు. మోడీ టార్గెట్ గా వెళ్తున్న కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ తో అయిన కలవడానికి సిద్ధంగా ఉంది. సోనియా కు ఇటీవల ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ పొత్తు లైవ్ లో ఉంది. తెలంగాణ సీనియర్లు చాలా కాలం కేసీఆర్ తో కలిసి నడవాలని ప్లాన్ చేశారు. అక్కడే రేవంత్ కు సీనియర్లకు మధ్య తేడా ఉంది. కానీ అధిష్టానం ప్రస్తుతం సీనియర్ల వైపు ఉంది.

కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ పొత్తు లైవ్ లో (Alliance)

తాజా గా రాహుల్ అనర్హత వేటు మీద జరుగుతున్న నిరసనలకు బీ ఆర్ ఎస్ మద్దతు ఇచ్చింది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ తో కలిసి అడుగు వేసింది. గతంలోనూ రాహుల్ పుట్టుక మీద బీజేపీ చేసిన కమెంట్లను కేసీఆర్ ఖండించారు. మోడీని దించడానికి ఏ పార్టీ తోనైన కలవడానికి బీ ఆర్ ఎస్ కూడా సిద్ధంగా ఉంది. తెలంగాణ ఇచ్చిన , తెచ్చిన పార్టీ పొత్తు(Alliance) ఉంటే మూడోసారి తిరుగు లేకుండా అదుకారంలోకి రావచ్చని గులాబీ అంచనా . అందుకే ఆ రెండు పార్టీలు కలిసి నడవడానికి మానసికంగా సిద్ధపడటంలో భాగమే జనా రెడ్డి తాజా వ్యాఖ్యలు.

తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా ఇక మిగిలింది అధికారిక ప్రకటనేనా? అనేది సీనియర్ నాయకుడు జానారెడ్డి (Janareddy)మాటలు ఉన్నాయి. అయితే ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు  పొడుస్తుందా తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.. బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఫిక్స్ అయ్యిందా? తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు ఫిక్స్ అయ్యిందా? అనే ప్రశ్నలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయింది.

కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను కలిసి కూటమిగా

రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగే క్రమంలో పార్టీని విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు పెట్టి నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇంతకాలం కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను కలిసి కూటమిగా కోసం ప్రయత్నించారు. తాజాగా అదాని అంశం, రాహుల్‌ అనర్హతతో విపక్షాలన్నీ ఒకే వేదికపై వస్తున్నాయి. కాంగ్రెస్ కూడా విపక్షాలతో కలిసి (Alliance)పోరాటాలు చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీకి నెమ్మదిగా సంకేతాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy)బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారన్నారు.

కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పొత్తు విషయంలో జానారెడ్డి వదిలిన మాటలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపాయి. ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపాయి. దాంతో జానారెడ్డి వెంటనే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ పరిరక్షణ కోసం బీజేపీకి వ్యతిరేకంగా 17 పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని మాత్రమే చెప్పానని, ఎక్కడా కూడా బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందని తాను చెప్పలేదని వివరణ ఇచ్చారు జానారెడ్డి. పొత్తుల విషయం అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌ అన్నారు.

తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల్లో పొత్తులు

అటు కాంగ్రెస్‌ కేడర్‌ కూడా పొత్తులపై అప్పుడప్పుడు మాటలతూటలు పేలుస్తూనే ఉన్నారు. ఒకవేళ తెలంగాణలో హంగ్‌ వస్తే, సెక్యులర్‌ పార్టీలైనా కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోవాల్సిందేనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.ఇక బీజేపీని అంతం చేసేందుకు అన్నీ పార్టీలతో కలిసి ఐక్య ఉద్యమం చేస్తామని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాల్సిన అవసరం ఉందని జీవన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. జానారెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, అయినప్పటికీ కొట్టిపారేయ్యలేమని విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సమీకరణాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.

తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల్లో పొత్తులు ఉంటాయని ప్లీనరీ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటిచారు. దీంతో కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ పొత్తు తెరమీదకు వచ్చింది. అంతే కాదు రేవంత్ రెడ్డి ని తెలంగాణ టీడీపీ చీఫ్ కసాని జ్ఞానేశ్వర్ పార్టీలోకి ఆహ్వానించారు. అంటే పొత్తు విషయంలో ఏదో సీరియస్ చర్చ కాంగ్రెస్ లో జరుగుతుందని అర్థం అవుతుంది. లౌకిక పార్టీలు గా కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ తెలంగాణలో ఉన్నాయని కోమటిరెడ్డి వేంకట రెడ్డి ఇటీవల చెప్పారు. ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జోస్యం చెప్పారు. ఆయన కామెంట్స్ మీద తెలంగాణ నాయకులు కోప్పడ్డారు. కానీ, ఆయన చేసిన కమేంట్స్ కు అనుగుణంగా రాయపుర్ ప్లీనరీ తీర్మానం చేసింది. ఇలాంటి ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఏఐసీసీ చీఫ్ కూడా పొత్తు (Alliance) కోసం ప్రయత్నం అన్ని రాష్ట్రాల్లో చేసినట్టే తెలంగాణ లోను ఉంటుందని సంకేతం ఇచ్చారు. థర్డ్ ఫ్రంట్ అనేది మోడీకి మేలు చేస్తుందని పరోక్షం గా కేసీఆర్ ప్రయత్నాలను సోనియా ప్లీనరీ లో ప్రస్తావించారు. భవసారూప్యత ఉన్న పార్టీలను కలుపుకు పోవాలని ముఖ్త కంఠంతో ప్లీనరీ తీర్మానం చేసింది.

తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో పొత్తు (Alliance)

15 ఏళ్ల ప్రస్థానంలో టీ ఆర్ ఎస్ నుంచి టీడీపీ అక్కడనుంచి కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి మారారు. జడ్పీటీసీ గా ప్రత్యక్ష రాజకీయాలను ప్రారంభించి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ సీఎం కావాలని ఆయన లక్ష్యం. అంతే కాదు రెడ్డి సామాజిక వర్గానికి నాయకత్వంలోనే అన్ని పార్టీలు ఉండాలని ఆయన ఆలోచన. ఆయన పీసీసీ అయిన తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని సీనియర్లు భావిస్తున్నారు. ఆ మేరకు అధిస్తానంకు రిపోర్ట్ కూడా చేశారు. అందుకు హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయాలని పాదయాత్ర రేవంత్ చేస్తున్నాడు. మధ్య తరగతి, హిందు ఓటు బాంకును ఆకట్టు కొనేలా ఆయన ప్రయత్నించారు. అయితే ప్లీనరీ వేదికగా తీసుకున్న రెండు నిర్ణయాలు ఆయన ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీర్ లా చేసాయని సర్వత్రా వినిపిస్తుంది. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో పొత్తు(Alliance), అగ్ర వర్ణ పేదలకు మోడీ ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ దళితులకు, గిరిజనులకు కూడా షేర్ ఇస్తానని చెప్పటం పార్టీకి భారీ నష్టం కలిగిస్తుందని వినికిడి.

Also Read : BRS Leader Died: ఆత్మీయ సమ్మేళనంలో హఠాన్మరణం, గుండెపోటుతో BRS నేత మృతి!

తీర్మానాలను బీజేపీ అనుకూలంగా మలుచు కుంటుంది. ప్రత్యేకించి పొత్తు తీర్మానం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేలా బీజేపీ ప్రచారం చేస్తోంది. ఎన్నికల్లో పార్టీ గెలవదని కాంగ్రెస్ లోని సొంత పార్టీ వాళ్లకే బాగా తెలుసు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీ ఆర్ ఎస్ కలుస్తాయని బీజేపీ చెబుతుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ఒకటేనని ప్రజలు బీజేపీని అధికారంలోకి తెస్తారని బండి సంజయ్‌ అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులందరూ బీఆర్‌ఎస్‌కు జంప్ అవుతారని బీజేపీ భావిస్తుంది. ప్రజలు కూడా అయోమయంలో ఉన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే, ఎన్నికల్లో గెలిచి బీఆర్‌ఎస్‌లోకి జంప్ అవుతారని బలంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. గ్రేటర్, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ ప్రతినిధులు బీ ఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. అందుకే ప్రజలు కూడా బీజేపీ చేసే ఆరోపణలను నమ్ముతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో జానా రెడ్డి(jagana reddy) చేసిన కామెంట్స్ కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ పొత్తును ఫిక్స్ చేస్తూ సోషల్ మీడియాలో నెట్ జన్లు పలు అభిప్రాయాలను కూడా షేర్ చేస్తున్నారు. అంటే ఆ రెండు పార్టీలు ఒకే చోట కనిపోయించటమే కాదు ఎన్నికలకు కూడా కలిసి వెళ్తారని సర్వత్రా వినిపిస్తుంది.

Also Read:  Jagan graph : వైసీపీలో ఏప్రిల్ 3 టెన్ష‌న్, నో టిక్కెట్ జాబితా రెడీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Election
  • kcr
  • political alliance
  • political news
  • political parties
  • rahul

Related News

Support from Congress for TVK Vijay

TVK: టీవీకే కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, డీఎంకే-అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండికొట్టిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం'(టీవీకే)కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత

    Latest News

    • Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd