Narayanpet: కాంగ్రెస్ నాయకురాలిపై జిల్లా అధ్యక్షుడి లైంగిక దాడి!
నారాయణ పేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి.
- By Hashtag U Updated On - 02:21 PM, Tue - 10 May 22

నారాయణ పేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు వెలుగుచూశాయి. ఆయన తనపై వివిధ సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ పార్టీ నాయకురాలే ఆరోపించారు. ఈమేరకు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ 417, 420, 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 2020 మునిసిపల్ ఎన్నికల సమయంలో బాధితురాలికి నారాయణ పేట జిల్లాలో ప్రచార బాధ్యతలు అప్పగించారు. అప్పుడే ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. తన భార్య ఆరోగ్యం బాగోదని.. మూడేళ్లకు మించి బతకదని.. తనకు తోడు కావాలని.. అందుకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడని బాధితురాలు పేర్కొంది. తరువాత దుబ్బాక ఎన్నికల సమయంలో తన కోరిక తీర్చాలని బలవంతపెట్టాడని.. తాను వ్యతిరేకించడంతో తీవ్రంగా దాడి చేశాడని చెప్పింది.
తరువాత 2021 జూన్ 24న హోటల్ కు తీసుకెళ్లాడని అక్కడ బలవంతం చేయబోగా.. ఒప్పుకోకపోవడంతో పసుపుతాడు కట్టి పెళ్లయిపోయిందన్నాడు. ఆపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్నాడు. తరువాత బెంగళూరు ఓ పనిమీద తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశాడని బాధితారులు ఫిర్యాదులో వివరించింది. ఈమధ్యనే బేగంపేట్ లోని ఓ హోటల్ కు పిలిపించాడని.. అక్కడ లైంగిక దాడికి పాల్పడడానికి
ప్రయత్నించడంతో అడ్డుకున్నానని బాధితురాలి చెప్పింది. దీంతో మాయమాటలు చెప్పి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించి.. అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. తన నగ్నచిత్రాలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడని.. పిలిచినప్పుడు వచ్చి కోరిక తీర్చాలని బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
Related News

High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేరును సుప్రీంకోర్టు మంగళవారం సిఫార్సు చేసింది.