Ramoji Rao: అక్షర సూరీడు.. చనిపోక ముందే సమాది..
చెరుకూరి రామోజీరావు రైతు కుటుంబంలో పుట్టి..ఒక్కో మెట్టు ఎక్కుతూ...తన ఆర్టికల్ కోసం తెలుగు ప్రజలు ఎదురుచూసేలా ఆయన చేసిన సాహసం...అనన్యసామాన్యం.
- By manojveeranki Published Date - 06:40 PM, Sat - 8 June 24

Cherukuri Ramoji Rao: చెరుకూరి రామోజీరావు అలియాస్ రామోజీరావు(Ramoji Rao)….యావత్ భారతావనికి (Inida) పరిచయం అక్కర్లేని పేరు. రైతు కుటుంబంలో పుట్టి..ఒక్కో మెట్టు ఎక్కుతూ…తన ఆర్టికల్ కోసం తెలుగు ప్రజలు ఎదురుచూసేలా ఆయన చేసిన సాహసం…అనన్యసామాన్యం. పేరును బ్రాండ్‌గా మార్చటం…. తెలుగు నేలలో రామోజీతోనే మొదలైందని చెప్పడంలో… ఏమాత్రం అతిశయోక్తి లేదు. తన పేరుతో బ్రాండ్ అండ్ క్రెడిబిల్టీ క్రియేట్ చేయడం…అదీ వ్యాపార రంగంలో అంటే మామూలు విషయం కాదు.
జర్నలిస్టులను తీర్చిదిద్దిన రామోజీ
చాలా మంది రామోజీ స్కూల్లో సాదాసీదా జీవితాన్ని స్టార్ట్ చేసి… వ్యవస్థల్ని శాసించే స్థాయికి చేరుకున్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి (Sajjala).. కురసాల కన్నబాబు (Kurasala Kannababu).. కొమ్మినేని శ్రీనివాసరావు(Kmmineni).. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది జర్నలిస్టులు(Journalist)…కీలక స్థానాలకు చేరుకున్న వారే. వీరంతా ఈనాడు(Eenadu) బడిలో రామోజీరావు సెట్ చేసిన వ్యవస్థలో పని చేసి.. తమను తాము మెరుగుపర్చుకున్నవారే. అలా వ్యక్తుల్ని శక్తులుగా మార్చటం రామోజీకి(Ramoji) అలవాటు. ఆయన జీవితంలో చోటు చేసుకున్న ఘటనలు.. ఆయన తీసుకున్న నిర్ణయాలతో చోటు చేసుకున్న పరిణామాలను కథలుగా మార్చి సినిమాలు తీస్తే తక్కువలో తక్కువ యాభై సినిమాలు తీయొచ్చు. అలాంటి వ్యక్తి గురించి….మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..
వైఎస్ పాదయాత్ర అప్పుడు
రామోజీరావు అన్నా.. ఈనాడు అన్నా చంద్రబాబుకు (Chandrababu) తొత్తులని.. ఈనాడు చెప్పిందే తెలుగుదేశం పార్టీ (TDP) వింటుందని.. తెలుగుదేశం ప్రయోజనాలు తప్పించి ఇంకేమీ పట్టవమన్న మాటలు చాలానే వింటారు. అయితే.. అది పూర్తి వాస్తవం కాదు. అందులో నిజం ఎంతన్నది చాలా తక్కువ మందికి తెలుసు. వైఎస్ఆర్ (YSR) పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు.. ఆయన యాత్రకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి వేళ రాజకీయంగా వ్యతిరేకించే వైఎస్ పాదయాత్రను ఎలా కవర్ చేయాలన్న దానిపై..ఈనాడు (EENADU) ఎడిటోరియల్ విభాగం గందరగోళానికి గురైంది. అలాంటి టైమ్‌లో వైఎస్ పాదయాత్ర (Ys Padayatra) కవరేజ్ మాట గురించి అడిగితే.. రామోజీరావు (Ramoji Rao) నోటి నుంచి వచ్చిన మాట.. ప్రజలు అంతలా అభిమానిస్తే మనం ఎందుకు వార్తలు ఇవ్వకూడదు. మనం ప్రజల పక్షాన ఉందామని చెప్పారు రామోజీ.
వైఎస్ మరణం వేళ..
ఈనాడు(EENADU) సంస్థల అధినేత రామోజీరావుకు ఏపీ సీఎంగా వ్యవహరించిన… వైఎస్ రాజశేఖర్ రెడ్డికి (YSR) మధ్య ఎలాంటి శత్రుత్వం ఉందో… ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ప్రభుత్వ వ్యతిరేకంగా వార్తలు రాయొద్దని వైఎస్ నుంచి వినతులు.. మీకేం కావాలన్నా తాము చేస్తామని చెప్పినా రామోజీ వినలేదు. ప్రజల పక్షాన ఉంటాం. ప్రజాసమస్యల్ని ఎత్తి చూపకపోతే ఎలా? అన్నదే ఆయన వాదన. ప్రభుత్వం చేసే తప్పుల (Mistakes) గురించి ప్రశ్నించకుండా ఎలా ఉంటాం? అన్నది ఆయన వేదన. అలా మొదలైన ఆయన పోరు… పెరిగి పెద్దదై ఎంతవరకు వెళ్లిందో అందరికి తెలుసు. వైఎస్ ఏం చేసుకుంటారో చేసుకోవాలన్నారే కానీ… రాజీకి వచ్చింది లేదు. ఉప్పు.. నిప్పులా ఉన్న వేళలో.. అనూహ్య రీతిలో వైఎస్ ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ మరణించిన వేళ.. (Ys Dies) ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు రామోజీ సిద్ధమైనప్పుడు కొందరు వారించారు. సార్.. మీరు వెళితే.. అన్న అనుమానాల్ని వ్యక్తం చేశారు. ఆయన మంచి మనిషి అయ్యా.. వ్యక్తిగతంగా ఆయనకు నాకు ఏం వైరం ఉంది. ఆయన కుటుంబం ఇప్పుడు ఎంతో శోకంలో ఉంది. పరామర్శించటం నా ధర్మం అని అన్నారు రామోజీ.
బట్టలు విప్పదీసిన జగన్ ను సైతం..
ఈనాడు రామోజీ (Ramoji Vs Ys Family) వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ మధ్య నడిచిన వైరం గురించి తెలుగు నేలలో తెలియని వారు ఉండరు. వీరి మధ్య ఉన్న వైరంలో భాగంగా రామోజీ తప్పుల్ని ఎత్తి చూపుతూ.. ఆయన బట్టలు విప్పదీసిన కార్టూన్లను (Cartoons) సాక్షిలో(Sakshi) ప్రచురించారే తప్పించి.. ఏ రోజూ ఈనాడులో (EENADU) అలాంటివి చేయలేదు. దీనికి కారణం.. మనకంటూ ఒక పద్దతి ఉంది. దాన్ని మించిపోవద్దంటూ ఎప్పటికప్పుడు చెప్పేవారు. ఆవేశానికి లోనయ్యే వారిని.. ఆ తీరు తప్పంటూ సర్దేవారు. అలా అని వైఎస్ ఫ్యామిలీ(Ys Family) మీద ఆయనకు ఆగ్రహం లేదని చెప్పట్లేదు. కానీ.. అదంతా ధర్మాగ్రహం. తాను నమ్మిన సిద్ధాంతానికి భిన్నంగా జరుగుతున్న అంశాల మీద ఆయన పోరు తప్పించి.. వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలన్న భావన ఉండదు.
టైం అంటే టైం:
ఒకసారి టైం ఫిక్స్ అయ్యాక.. ఏం జరిగినా సరే చెప్పిన సమయానికి ఒక నిమిషం ముందు ఉండటం రామోజీకి అలవాటు. ఎవరికైనా టైం ఇస్తే..ఎన్ని పనులు ఉన్నా.. ఆ టైంకు వారిని కలుస్తారే తప్పించి.. వెయిట్ చేయించటం ఇష్టం ఉండదు. అంతేకాదు.. ఆయన తన ఉద్యోగులకు సౌకర్యాల్ని కల్పించే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. జీతాలు భారీగా ఇవ్వరు కానీ… సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన డబ్బులు మాత్రం ఇచ్చే అలవాటు ఉంటుంది. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే రామోజీ.. ఈ విషయంలో మాత్రం ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తారు.
సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్:
ఒక పవర్ ఫుల్ మీడియా హౌస్ ను (Media House) నడిపే క్రమంలో తమ ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకోవాలని.. అందులో భాగంగా తమ మీడియాలో తమను ఎక్కువగా ఫోకస్ చేయాలన్న తాపత్రయం చాలామంది యజమానులు ప్రదర్శిస్తుంటారు. ఈ విషయంలో రామోజీ రావు (Ramoji Rao) చాలా తేడా. చివరి పదేళ్లలో మార్పులు వచ్చాయి కానీ.. మొదట్లోనూ.. ఆ తర్వాత కూడా తనకు సంబంధించిన.. తన కుటుంబానికి సంబంధించిన వార్తల విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉండేవారు. తాము పాల్గొన్న ప్రోగ్రాంలకు సంబంధించిన వార్తను వేసే క్రమంలో ఫోటో పెద్దదిగా వేసినా తర్వాతి రోజు అక్షింతలు ఖాయం. మొదట్లో అయితే.. తమ ఫోటోలు వేయాల్సిన అవసరమే లేదని తేల్చేశారు. ఓవైపు అక్షరం మీదున్న ఇష్టం మరోవైపు ప్రజల మక్కువ పెంచుకున్నారు.