Akbaruddin Owaisi : రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్..?
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం
- By Sudheer Published Date - 11:43 AM, Fri - 8 December 23

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారంలోకి వచ్చింది. 64 స్థానాల్లో విజయం సాధించి మరో పార్టీ సపోర్ట్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిన్న గురువారం సీఎం గా రేవంత్ రెడ్డి (Revanth Reddy) , ఉప ముఖ్యమంత్రి గా భట్టి విక్రమార్క (Bhatti VIkramarka) తో పాటు పలువురులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇక రేపటినుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యేల చేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక సమావేశాల కంటే ముందే ప్రొటెం స్పీకర్ (protem speaker) ను నియమించాల్సి ఉంటుంది. ఎన్నికైన సభ్యుల్లో సీనియర్ ఒకరిని ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ నియమిస్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) 8 సార్లు ఎన్నిక కాగా, ఇతర సభ్యుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి , తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్ ఆరుసార్లు గెలిచారు.
కాంగ్రెస్ నుంచి ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు ఆరుసార్లు ఎన్నిక కాగా వారిద్దరు మంత్రులుగా ఉన్నారు. ఎంఐఎంకి చెందిన అక్బరుద్దీన్ ఓవైసీ ఆరుసార్లు శాసనసభ ఎన్నికయ్యారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సీఎం రేవంత్ సమాచారం అందించారట. ఒకవేళ అందుకు ఒవైసీ అంగీకరిస్తే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ గా డిసెంబరు 9న అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Also : Praja Darbar : ప్రజాదర్బార్ కు పోటెత్తిన ప్రజలు