Akbaruddin Owaisi : మోడీ వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ కౌంటర్
తాము చొరబాటుదారులమని, ఎక్కువ మంది పిల్లల్ని కంటామని ప్రధాని మోడీ విమర్శిస్తున్నారని, కానీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఎంత మంది సోదరులు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు.
- Author : Sudheer
Date : 23-04-2024 - 1:40 IST
Published By : Hashtagu Telugu Desk
లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) కొనసాగుతున్న వేళ ముస్లిం(Muslim) లపై ప్రధాని మోడీ(PM Modi) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు మోడీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించగా..తాజాగా ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ (Akbaruddin Owaisi) ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్బరుద్దీన్ మాట్లాడుతూ..తాము చొరబాటుదారులమని, ఎక్కువ మంది పిల్లల్ని కంటామని ప్రధాని మోడీ విమర్శిస్తున్నారని, కానీ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఎంత మంది సోదరులు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join.
ముస్లింలకు ఎక్కువ మంది పిల్లలు ఉండడం కాదు, వాజ్‌పేయికి ఏడు మంది సోదరసోదరీమణులు ఉన్నారని, యోగి ఆదిత్యనాథ్ ఇంట్లో కూడా ఏడు మంది ఉన్నారని, అమిత్ షా ఇంట్లో కూడా ఏడు మంది ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోదీకి ఆరు మంది సోదరులు ఉన్నారని అక్బరుద్దీన్ అన్నారు. ఈ దేశానికి తాజ్ మహల్, ఖుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, జామా మసీదు, చార్‌మినార్ ఇచ్చామని, ఈ దేశాన్ని అద్భుతంగా అలంకరించామని, తామేమీ చొరబాటుదారులం కాదు అని అన్నారు. ఈ దేశానికి తాము చెందుతామని, ఇది తమ దేశమని, ఎప్పటికీ తమదే అవుతుందని అక్బరుద్దీన్ కౌంటర్ ఇచ్చారు.
Read Also : CSK vs LSG: నేడు చెన్నై వర్సెస్ లక్నో.. సీఎస్‌కే ప్రతీకారం తీర్చుకుంటుందా..?