Hyderabad : ఎంఐఎం ఎమ్మెల్యేపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముమైత్ ఖాన్, ఆయన కుమారుడుపై కేసు నమోదైంది. అనుమతి
- Author : Prasad
Date : 05-11-2023 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ముమైత్ ఖాన్, ఆయన కుమారుడుపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా నిరసన ర్యాలీ చేపట్టినందుకు ఏఐఎంఐఎం చార్మినార్ శాసనసభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఆయన కుమారుడు ఇంతియాజ్ ఖాన్, ఇతర పార్టీ కార్యకర్తలపై మొగల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం అర్థరాత్రి ఎమ్మెల్యే కుమారుడు ఇంతియాజ్‌ను రెండేళ్ల నాటి కేసుకు సంబంధించి హుస్సేనియాలం పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఆయన కుమారుడు ఇంతియాజ్ ఖాన్, రెండు వందల మంది పార్టీ కార్యకర్తలు వోల్టా హోటల్ ఎక్స్ రోడ్డు నుంచి హుస్సేనియాలం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఏఐఎంఐఎం నేతలు, కార్యకర్తల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కాగా రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా చార్మినార్ ఎమ్మెల్యే తదితరులు అక్రమంగా నిరసన ర్యాలీ నిర్వహించారని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని మొగల్‌పురాలోని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రంగనాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన మొఘల్‌పురా పోలీసులు ఎమ్మెల్యే, ఆయన కుమారుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మొఘల్‌పురా పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మహ్మద్ నయీమ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Andhra Pradesh : దళితులపై దాడులు చేస్తుంటే యాత్రలు చేస్తున్న మంత్రులకు సిగ్గులేదా..?